
బెంగళూరు: ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలోని ట్విస్టులు సినిమాల్లో కూడా చూసుండరేమో. కొద్ది నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ కథకు లాటరీ పద్ధతి శుభం కార్డు పడేలా చేసింది. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు.
చివరికి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఆ యువతులకు తెలిసినా అతన్నే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ కాస్త పెద్దలకు ముందుకు వెళ్లింది. పంచాయితీలోనూ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇదే సమయంలో ఓ యువతి.. అతడు లేని జీవితం తనకు వద్దని చెప్పి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు సకాలంలో స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. చికిత్స అనంతరం కోలుకుని ఆమె ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చింది.
దీంతో తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై పంచాయతీ జరగగా, గ్రామస్థులు ఓ పరిష్కారాన్ని సూచిస్తూ.. లాటరీ పద్ధతి ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇద్దరు ఓకే చెప్పడంతో లాటరీ తీయగా, విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. దీంతో అదే రోజు అమెతో వివాహం జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment