Lottery method
-
H-1B Visa: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు
వాషింగ్టన్: భారతీయులకు భారీగా ఊరట కలిగేలా అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతి ద్వారా హెచ్–1బీ వీసాల మంజూరుకు బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ప్రతిపాదనల్ని అమెరికా ఫెడరల్ జడ్జి కొట్టేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన అధికారాలన్నీ ఉపయోగించుకొని వలస విధానంలో ఎన్నో మార్పుల్ని తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో విదేశాల నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడానికి వేతనాల అధారంగా హెచ్–1బీ వీసాలను జారీ చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ ప్రతిపాదనల్ని కాలిఫోరి్నయాలోని జిల్లా కోర్టుకు చెందిన ఫెడరల్ న్యాయమూర్తి జడ్జి జెఫ్రీ ఎస్ వైట్ కొట్టేశారు. అప్పట్లో తాత్కాలిక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిగా చాద్ వుల్ఫ్ నియామకం చట్టబద్ధంగా జరగలేదని, అందుకే ఆయన ఆధ్వర్యంలో చేసిన ఈ సవరణల్ని కొట్టేస్తున్నట్టుగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. వేతనాల ఆధారంగా హెచ్–1బీ వీసాలు మంజూరు చేస్తే విదేశాల నుంచి తక్కువ వేతనాలకు వచ్చే వారి సంఖ్య తగ్గి పోతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని పేర్కొంటూ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో భారతీయులకు భారీగా ఊరట లభించింది. ఐటీ కంపెనీలు హెచ్–1బీ వీసా మీద భారత్, చైనా నుంచి భారీ సంఖ్యలో టెక్కీలకు ఉద్యోగాలు ఇస్తుంటాయి. ట్రంప్ తీసుకువచ్చిన సవరణల ప్రకారం వేతనాల ఆధారంగా వీసాలు ఇస్తే కనుక అత్యంత నైపుణ్యం కలిగిన, భారీ వేతనాలు అందుకొనే వారికి మాత్రమే అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది. తక్కువ వేతనానికి ఉద్యోగుల్ని నియమించుకోవడానికి వీలు కాదు. అందుకే టెక్ కంపెనీలన్నీ ఈ ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీ ఏడాది 65 వేల హెచ్–1బీ వీసాలను మంజూరు చేస్తారు. దానికి అదనంగా మరో 20 వేల వీసాలు అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వారికి ఇస్తారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట అన్నవిధానంతో పాటు లాటరీ విధానం ద్వారా ఈ వీసాలను మంజూరు చేస్తారు. -
ఇద్దరితో యువకుడి ప్రేమ.. వధువు కోసం లాటరీ!
బెంగళూరు: ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీలోని ట్విస్టులు సినిమాల్లో కూడా చూసుండరేమో. కొద్ది నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ కథకు లాటరీ పద్ధతి శుభం కార్డు పడేలా చేసింది. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఆ యువతులకు తెలిసినా అతన్నే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ కాస్త పెద్దలకు ముందుకు వెళ్లింది. పంచాయితీలోనూ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇదే సమయంలో ఓ యువతి.. అతడు లేని జీవితం తనకు వద్దని చెప్పి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు సకాలంలో స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. చికిత్స అనంతరం కోలుకుని ఆమె ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చింది. దీంతో తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై పంచాయతీ జరగగా, గ్రామస్థులు ఓ పరిష్కారాన్ని సూచిస్తూ.. లాటరీ పద్ధతి ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇద్దరు ఓకే చెప్పడంతో లాటరీ తీయగా, విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. దీంతో అదే రోజు అమెతో వివాహం జరిపించారు. చదవండి: లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం -
లాటరీ పేరిట కుచ్చుటోపీ
తొలిరోజు 5 రూపాయలు, రెండవ రోజు రూ.6, 3వ రోజు రూ.7..ఇలా రోజుకో రూపాయి పెంచుకుంటూ నెల తిరిగేసరికి రూ.656 చెల్లింపు..ఆపై లాటరీలో పలు రకాల వస్తువులు..చీప్ అండ్ బెస్ట్‌లో భలే బాగుంది స్కీమ్ అని పేద, మధ్య తరగతి మహిళలు ఎగిరి గంతేశారు..అడపాదడపా లాటరీలో చిన్నపాటి వస్తువులు ఇస్తూండడంతో సోషల్ మీడియా కంటే వీరి నోళ్లల్లో ఇది బాగా వైరల్ అయ్యింది. ఇంకేముంది? మరెందరో అమ్మలక్కలు ఈ లాటరీ స్కీమ్‌లో చేరిపోయారు. లాటరీ మాయలోడు అనుకున్న టార్గెట్ చేరుకునేసరికి రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్దేశాడు. ఈసారి అందరి నోళ్లూ లబోదిబోమన్నాయి. మళ్లీ ఇది వైరల్ అయ్యింది!! సాక్షి, రొంపిచెర్ల(చిత్తూరు) : రైస్ కుక్కర్లు, స్టీల్ బిందెలు, కుర్చీలు..వంటసామాన్లు..వేటికైనా సరే రోజూ డబ్బులు కడితే లాటరీలో వస్తువులు ఇస్తామని నమ్మించి ఓ వ్యాపారి లక్షల రూపాయలు వసూలు చేసుకుని జెండా ఎత్తేశాడు. దీంతో బాధితులు గగ్గోలు పెట్టారు. వివరాలు.. పీలేరు వాసినంటూ ఎస్.సాఫిక్‌బాషా అనే ఓ వ్యక్తి ఆరేడు నెలల క్రితం స్థానిక బజారు వీధిలో ఒక ఇంటిని బాడుగకు తీసుకుని ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ పేరిట దుకాణం తెరిచాడు. మొదటి రోజున 5 రూపాయలు కడితే చాలు..ఆ తర్వాత రోజు నుంచి రోజూ రూపాయి కలుపుకుని కడితే చాలంటూ ఊదరగొట్టాడు. ఇది మహిళల నోట బాగా నానడంతో స్థానికంగా బాగా ప్రచారమైంది. అడపాదడపా లాటరీ వేస్తూ వంద రూపాయల విలువ చేసే వస్తువులు ఆయా ప్రాంతాల్లో మహిళలకు ఇస్తూండడంతో వారికి నమ్మకం కలిగింది. పాసు పుస్తకం తరహాలో ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ పేరిట కార్డును మహిళలకు ఇచ్చి అందులో తీసుకున్న డబ్బుల వివరాలు ఎంట్రీ చేసేవాడు. దీంతో రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని ముత్యాలమ్మ గుడివీధి, పాళ్యెంవీధి, హైçస్కూల్‌వీధి, చిన్నమసీదువీధి, బలిజవీధి, శ్రీరాములగుడివీధి గ్రామాల్లో సుమారు 800 మంది నెల నెలా రూ656 చెల్లించారు. లాటరీ పేరిట వేస్తున్న వస్తువులకు మహిళలు మరింత ఆకర్షితులయ్యారు. దీంతో వందల మంది మహిళలు 6 నెలలుగా దాదాపు రూ20 లక్షల వరకూ చెల్లించారు. అయితే ఆదివారం రాత్రి ఆ వ్యాపారి ఎవరికీ చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి అదృశ్యమయ్యాడు. బాధిత కుటుంబం వ్యాపారి తమిళనాడు వాసేనా? సోమవారం అతని దుకాణం తెరవకపోవడం, అతగాడు ఇచ్చిన సెల్ నంబర్ 97860 54496కు ఫోన్ చేస్తే ‘‘ఆప్ కీ ద్వారా డయల్ కియా గయా నంబర్ ఉపయోగ్ మే నహీ హై’’! అని వస్తూండడంతో అక్కడికి వచ్చిన మహిళలు గుండెల్లో రాయి పడినట్లైంది. తొలుత తమిళంలో ఇదే విషయం వస్తూండడంతో ఇతగాడు తమిళనాడు వాసి కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందకంటే గతంలో ఇలా లాటరీ, తక్కువ ధరకే వస్తువుల పేరిట జిల్లాలో దుకాణాలు తెరచి బిచాణా ఎత్తేసినవాళ్లంతా చాలావరకు తమిళనాడు వాసులే కావడం గమనార్హం! లాటరీ వ్యాపారి జంప్ అయ్యాడనే విషయం దావానలంలా వ్యాపించడంతో బాధితులు పోలో మంటూ దుకాణం వద్దకు చేరుకున్నారు. తాము మోసపోయామని గ్రహించి లబోదిబో మన్నా రు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో వ్యాపారి కోసం పీలేరులో గాలించారు. అలాంటి వ్యక్తి ఎవరూ పీలేరులో లేరని తెలియడంతో బావురుమన్నారు. -
లాటరీ ఎంపిక ద్వారా హోంగార్డుల బదిలీ
సాక్షి, ఆదిలాబాద్ : లాటరీ ద్వారా ఎంపిక చేసి 209 మంది హోంగార్డులతో పాటు 38 మంది మహిళ హోంగార్డులను సైతం బదిలీలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్విరామదంగా లాటరీ పద్ధతిన హోంగార్డుల బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా హోంగార్డులకు కౌన్సెలింగ్ నిర్వహించి, అందరి ఆమోదం ప్రకారమే లాటరీ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పడ్డాక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హోంగార్డులు దీర్ఘకాలంగా ఇతర జిల్లాలో పనిచేస్తున్నారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని బదిలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా నిర్మల్ జిల్లా 29+1, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 41+1, ఆదిలాబాద్ జిల్లా 61+36 హోంగార్డులను బదిలీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 38 మంది మహిళ హోంగార్డులు ఉన్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో స్థానికంగా ఉన్న హోంగార్డులే పని చేస్తున్నారని, అక్కడ బదిలీ సమస్య లేదన్నారు. లాటరీ ద్వారా బదిలీ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. రోజువారీ విధులకు ఆటంకాలు కలగకుండా తుది ఉత్తర్వులు వెలువడిన అనంతరం కొంత మంది రిలీవ్ కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీఎస్ రవి కుమార్, శిక్షణ కేంద్రం డీఎస్పీ ఎల్సి నాయక్, ఆదిలాబాద్ ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజా ఉద్దీన్, పోలీస్ కార్యాలయం అధికారులు సందీప్, జగదీష్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ఆర్ఐలు ఓ.సుధాకర్‌రావు, వి.వామనమూర్తి, కె.ఇంద్రవర్ధన్, సిబ్బంది విఠల్, మదన్, భారత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడే లక్కీ డే
నిర్మల్‌రూరల్/ఆదిలాబాద్: మద్యం దుకాణాల లక్కీ డ్రాకు సమయం ఆసన్నమైంది. దరఖాస్తు చేసుకున్న వ్యాపారుల్లో ఎవరిని అదృష్టం వరించనుందో శుక్రవారం తెలిసిపోతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు ఎవరూ ఊహించని స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నెల 13 నుంచి వారం రోజులపాటు నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో చివరి రోజు వెయ్యికిపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 160 మద్యం దుకాణాలకు ఏకంగా 2,372 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్, నిర్మల్‌లో స్టార్ఫంక్షన్హాల్, కుమురం భీం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, మంచిర్యాల జిల్లాలో పద్మావతి గార్డెన్లో మద్యం టెండర్లకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు. జిల్లాలో రెండేళ్ల కాలపరిమితితో దుకాణం దక్కించుకున్న వారు 2019 సెప్టెంబర్ 30 వరకు మద్యం అమ్మకాలు సాగించవచ్చు. 9.30 గంటలకే హాజరుకావాలి.. శుక్రవారం లక్కీ డ్రాకు హాజరయ్యే మద్యం వ్యాపారులు ఉదయం 9.30 గంటలకే రావాలని అధికారులు చెబుతున్నారు. వ్యాపారులకు ఎంట్రిపాస్ ఉంటేనే అనుమతిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఉదయం 11 గంటలకు మొదటి లక్కీ విజేతను ప్రకటిస్తారు. ఏజెన్సీ వ్యాపారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాల్సి ఉంది. దుకాణం దక్కించుకున్న వ్యాపారులు 1/6 వంతు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.20.37 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు అదనంగా వచ్చింది. భారీ ఎత్తున దరఖాస్తులు రావడం, దరఖాస్తు ఫీజు నాన్రిఫరండేబుల్గా ఉండడంతో ఈ ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌లోని షాప్‌నెంబర్ 4కు అత్యధికంగా 75 దరఖాస్తులు రాగా, ఆ తర్వాతి స్థానంలో బెజ్జూర్ 70, గత మద్యం పాలసీ 2015–17 సంవత్సరంలో కూడా ఉమ్మడి జిల్లాలో బెజ్జూర్‌కు 75 దరఖాస్తులతో మొదటిస్థానంలో నిలవడం గమనార్మం. తాళ్లపల్లి షాప్‌నెంబర్ 1, 2 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులే రాగా, మంచిర్యాలలోని సింగపూర్ షాప్‌నెంబర్ 1, 3, తాళ్లగుర్జాల, దండేపల్లి దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చాయి. -
లాటరీ పద్ధతిన మార్కెట్ చైర్మన్ల నియామకం!
సాక్షి, హైదరాబాద్: లాటరీ పద్ధతిన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఈ విధానాన్ని ఎంచుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మార్కెట్ కమిటీ పాలకమండళ్ల నియామకంలో రిజర్వేషన్లను పాటిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో చైర్మన్ల నియామకం ఆ పార్టీ శ్రేణులను ఊరిస్తోంది. రిజర్వేషన్ల విధానమెలా ఉంటుంది.. ఎలా ఖరారు చేస్తారు.. ఏయే మార్కెట్ కమిటీలను ఎవరికి కేటాయిస్తారనేవి చర్చనీయాంశమయ్యాయి. రిజర్వేషన్ల అమలుపై మార్కెటింగ్ శాఖ కసరత్తు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా రైతుల వివరాలు అందుబాటులో లేకపోవడంతో రిజర్వేషన్ల ఖరారు కత్తి మీద సాములా అవుతుందని అధికారులు భావిస్తు న్నారు. రాష్ట్రంలో 183 నోటిఫైడ్ వ్యవసాయ మార్కెట్లున్నాయి. వీటిని విభజించి మరో 30 మార్కెట్ యార్డుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే ఎస్సీ, ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్లు, అదే తరహాలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ప్రకటించారు. తాజా నిర్ణయాల ప్రకారం.. ఏజెన్సీల్లోని మార్కెట్ కమిటీలను గిరిజనులకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని లాటరీపద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ముందుగా అన్ని మార్కెట్ల పేర్లను చిట్టీలపై రాసి డబ్బాలో వేస్తారు. ఎస్టీ రిజర్వేషన్ల శాతం మేరకు అంత సంఖ్యలోనే డ్రా తీస్తారు. వాటిని ఆ కేటగిరీకి రిజర్వు చేస్తారు. అదే వరుసలో ఎస్సీలు, బీసీల శాతం ప్రకారం డ్రా తీస్తారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కడి చైర్మన్‌గా నామినేట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
‘అసలే కోతి.. పైగా కల్లు తాగింది’..
‘అసలే కోతి.. పైగా కల్లు తాగింది’.. అన్న సామెతను తలపిస్తోంది జిల్లాలో అబ్కారీ శాఖ తీరు. ప్రధాన ఆదాయం సమకూర్చే శాఖ కావడంతో సహజంగానే సర్కారు దీని విషయంలో చూసీచూడనట్లు పోతోంది. అసలే అవినీతి మత్తులో నిత్యం జోగుతుండే ఈ శాఖలోని కొందరు అధికారులు ఇదే అదనుగా మరింత దోపిడీకి తెగబడుతున్నారు. వర్గం, యూనియన్ ప్రతినిధులమన్న తోకలు తగిలించుకొని రెచ్చిపోతున్నారు. అడ్డుచెప్పిన ఉన్నతాధికారులనే ధిక్కరించేలా తోక జాడిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. చివరికి బెల్ట్‌షాపులు, సారా విక్రయాలను అరికట్టాలన్న సర్కారు లక్ష్యానికే తూట్లు పొడుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలో అక్రమార్జనే ధేయయంగా కొందరు సీఐలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, మద్యం దుకాణాల కేటాయింపులు పూర్తి చేసి అత్యధిక ఆదాయాన్ని లక్ష్యం గా నిర్దేశించడాన్ని అనువుగా తీసుకున్న వీరు మరింత శ్రుతి మించి పోతున్నారు. వీరి ఆగడాలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో ఓ కన్నేసినట్టు తెలిసింది. అయితే సామాజికవర్గం పేరు చెప్పుకొని ఒకరు, ఉద్యో గ సంఘాల ప్రతిని దులమంటూ మరి కొందరు జిల్లా అధికారులనే సవాల్ చేస్తున్నారు. జీతం కంటే గీతానికే ప్రాధాన్యమిస్తూ దోపిడీపర్వం సాగిస్తున్నారు. జిల్లాలో ఇటీవలే 217 మద్యం దుకాణాలను ఇటీవలే లాటరీ పద్ధతిలో కేటాయించారు. రాజాం లోని నాలుగు బార్లు మినహా జిల్లాలోని మిగతా బార్ అండ్ రెస్టారెంట్లకూ రెన్యూవల్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో జిల్లా వ్యాప్తంగా 14 మంది సీఐలతో పాటు నాలుగు మొబైల్ పార్టీలు, ఎన్ఫోర్సుమెంట్ సిబ్బంది వాటి నియంత్రణకు పని చేయాల్సి ఉంది. కానీ మూడు సర్కిళ్లలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇచ్ఛాపురంలో ఇష్టారాజ్యం ఇచ్ఛాపురం సర్కిల్లో సిండికేట్లకు దన్నుగా నిలిచిన ఎక్సైజ్ అధికారులు కొత్తవారికి మద్యం దుకాణాలు దక్కకుండా దందా నడిపించారు. పైగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముకోవచ్చని దుకాణదారులకు భరోసా ఇచ్చేశారు. తమ వాటాగా బాటిల్‌కు రూ.2 ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దాంతో వ్యాపారులు క్వార్టర్ బాటిల్‌పై రూ.5, ఫుల్ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తూ అందులో రూ.8 అధికారులకు పంపిస్తున్నారని తెలిసింది. ఇందులో తమకూ కొంత మిగులుతుండటంతో అధికారులు చెప్పినదానికి తలూపుతున్నారు. కాగా తమ వాటా సొమ్ము సక్రమంగా అందుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతిరోజూ జరిగే అమ్మకాల రికార్డులను సర్కిల్ అధికారులు తెప్పించుకొని పరిశీలించి మరీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో 100 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కేసుతో ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు అప్పగించాల్సిన ఆ కారును అక్కడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత పనులకు వాడుకుంటున్నా రు. ఇటీవల పలాసలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశానికి సైతం అదే కారులో వెళ్లారని కింది స్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో సారా బట్ట్టీలను ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఒక్కో బట్టీ యజమాని నుంచి నెలకు రూ.25 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. బెల్టు షాపుల వారికి కూడా ఇక్కడి అధికారి అభయహస్తమిచ్చారని తెలిసింది. ఒడిశా సారా వ్యాపారులను మద్యం వ్యాపార ంలోకి దించేందుకు కూడా అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యవహారాలన్నింటినీ సదరు అధికారి ఓ కానిస్టేబుల్ ద్వారా నడిపిస్తున్నారని తెలిసింది. ఆయన ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోం దని ఎక్సైజ్ సిబ్బందే గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణ అధికారుల వ్యవహార శైలిపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. బెల్ట్ షాపుల నియంత్రణలో నిర్లక్ష్యం విహ స్తున్నారని ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ఓ సమావేశంలో సాక్షాత్తూ మంత్రే ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పట్టణ పరిధిలో ఉన్న 40 దుకాణాల్లో నెలవారీ మామూళ్లే రూ.లక్షల్లో ఉంటాయని సిబ్బందే చెబుతున్నారు. కాగా ఈ సర్కిల్ అధికారి ఒక మద్యం వ్యాపారి ద్వారా నెలవారీ మామూళ్లు వసూలు చేయించి విశాఖలో ఉన్న తన ఇంటికి గుట్టుచప్పుడు కాకుండా పంపిస్తున్నారని తెలుస్తోంది. అబ్కారీ శాఖకు ఆదాయానికే గండి పడే విధంగా వ్యవహరిస్తున్న ఈ అధికారి తనను అడ్డుకోవాలని చూస్తే.. అంతు చూస్తానన్న రీతిలో జిల్లా అధికారులపైనే బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే రీతిలో పాతపట్నం సర్కిల్ అధికారులపైనా అరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలిసింది. -
‘ఎక్సైజ్’కు కాసుల పంట
- లెసైన్స్‌ల ద్వారా ఏడాదికి రూ.52.75 కోట్లు - దరఖాస్తుల అమ్మకాలపై రూ.9.52 కోట్లు - మద్యం విక్రయాలపై వెయ్యికోట్లకు పైగానే... ఖమ్మంక్రైం: ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండింది. జిల్లాలోని వైన్ షాపులను సోమవారం లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. అటు దరఖాస్తుల అమ్మకం, ఇటు షాపుల కేటాయింపు ద్వారా ఎక్సైజ్ శాఖ భారీస్థాయిలో ఆర్జించింది. ఈనెల 15 నుంచి 21 వరకు జిల్లాలోని మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో మొత్తం 147 షాపులు ఉండగా వీఎం బంజరలో రెండు, గుండాలలో ఒకటి, పెనగడపలో రెండు దుకాణాలకు మినహా 142 షాపులకు3,837 దరఖాస్తులు వచ్చాయి. వీటి చలానాల ద్వారా రూ.9,59,25 వేల ఆదాయం లభించింది. ఖమ్మంలోని న్యూబగ్గా వైన్‌షాపునకు, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వద్ద గల పల్లెగూడెం షాపునకు అత్యధికంగా 111 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఈ రెండు షాపుల దరఖాస్తుల అమ్మకం ద్వారానే రూ.55.50 లక్షల ఆదాయం సమకూరింది. ఖమ్మం నగరంలోని షాపులకు వ్యాపారులు ఎక్కువగా పోటీపడ్డారు. ఏజన్సీ ప్రాంతంలోని షాపులకంటే కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న షాపులపైనే వ్యాపారులు దృష్టి కేంద్రీకరించారు. తొలివిడతలో 17 కోట్లు.. డ్రాలో గెలుపొందిన వ్యాపారి మొదటిసారిగా 33.33 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తొలి విడతగా 142 మంది వ్యాపారులు చెల్లించిన మొత్తం రూ.17.03 కోట్లకు చేరింది. ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న 18 షాపులకు రూ.42 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 10వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న 32 షాపులకు రూ.34 లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 24 షాపులకు రూ.32.50 లక్షలు, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న 26 షాపులు రూ.42 లక్షలు, 10వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న 19 షాపులు రూ.34లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 23 షాపులు రూ.32.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని మూడు షాపులకు, కొత్తగూడెం సూపరింటెండెంట్ పరిధిలోని రెండు షాపులకు దరఖాస్తులు రాలేదు. మిగితా దరఖాస్తుల చలానాల ద్వారా రూ.9,59,25 వేలు, లెసైన్స్ ఫీజుల ద్వారా రూ.17.03 కోట్లు.. మొత్తం రూ.26,63,25 వేల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించింది. 147 షాపులకు రూ.52.75 కోట్ల ఆదాయం... ప్రతి నాలుగు నెలలకు ఒకసారి షాపులో 1/3 వంతు లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సంవత్సరం మొత్తంలో 147 షాపుల ద్వారా రూ.52.75 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించనుంది. ఇప్పటికే మొదటి విడత ఆదాయం రూ.17.03 కోట్లు వచ్చింది. మరో రూ.35.72 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కాగా, పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో ఆ మండలాల్లో ఉన్న తొమ్మిది షాపులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోయాయి. వీటి స్థానంలో జిల్లాలో మరో తొమ్మిది కొత్త షాపులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం షాపుల సంఖ్య 156కు చేరుతుంది. ఈ అన్ని షాపులలో మద్యం విక్రయాల ద్వారా జిల్లా ఎక్సైజ్ శాఖకు ఏడాదికి సుమారు వెయ్యికోట్లకు పైగానే ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. -
ఖమ్మం ఫస్ట్.. గార్ల లాస్ట్...
ఖమ్మం క్రైం:జిల్లాలో మద్యం దుకాణాల వేలం కోసం స్వీకరించిన దరఖాస్తులలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని రెండు షాపులు మొదటి స్థానంలో నిలిచాయి. ఖమ్మం ఖానాపురం హవేలీ షాపు నంబర్ 1, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం షాపులకు 111 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. గార్ల నుంచి తక్కువగా రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో అశ్వారావుపేట - షాప్ నంబర్ 2కు అత్యధికంగా 83 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి షాపునకు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. కొత్తగూడెం మండలం రుద్రంపూర్‌లో ఉన్న రెండు షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇక పెనుబల్లి, గుండాల మండలాల్లోని షాపులకు కూడా ఒక్క దరఖాస్తు రాలేదు. గత వారం రోజుల నుంచి మద్యం దుకాణాల వేలం పాటల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చారు. ఇలా కొత్తగూడెం, బూర్గంపాడు స్టేషన్ల పరిధిలోని షాపులకు ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా ఎక్సైజ్ శాఖకు ఈ చలానాల ద్వారా సుమారు రూ.9.59 కోట్ల వరకు ఆదాయం లభించింది. ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 77 షాపులకు 2,373 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 14 షాపులకు 420, ఖమ్మం అర్బన్ బల్లెపల్లిలోని రెండు షాపులకు 41, ఖమ్మం రూరల్ మండలంలోని రెండు షాపులకు 180 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం అర్బన్ మండలంలోని వెంకటాయపాలెం షాపునకు 12, చింతకాని మండలంలోని షాపునకు 86, కూసుమంచిలోని మూడు షాపులకు 104, నేలకొండపల్లిలోని రెండు షాపులకు 114, ముదిగొండలోని రెండు షాపులకు 58, తిరుమలాయపాలెంలోని రెండు షాపులకు 45, వైరాలోని మూడు షాపులకు 84, తల్లాడలోని మూడు షాపులకు 113, బోనకల్‌లోని మూడు షాపులకు 47, కొణిజర్లలోని రెండు షాపులకు 91, మధిరలోని ఆరు షాపులకు 127, ఎర్రుపాలెంలోని రెండు షాపులకు 88, సత్తుపల్లిలోని 8 షాపులకు 258, కల్లూరు మండలంలోని మూడు షాపులకు 136, వేంసూరులోని ఒక షాపునకు 100, ఇల్లెందులోని 8 షాపులకు 107, సింగరేణి మండలంలోని రెండుషాపుల నుంచి 81 దరఖాస్తులు వచ్చాయి. కాగా, పెనుబల్లి, గుండాల మండలంలోని మూడు షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. బయ్యారం షాపునకు 46, టేకులపల్లి షాపునకు 06, కామేపల్లి మండలంలోని షాపునకు 35 దరఖాస్తులు, అలాగే కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 70 షాపులకు 1464 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెం స్టేషన్ పరిధిలోని 33 షాపులకు 527, దరఖాస్తులు వచ్చాయి. పాల్వంచలోని 9షాపులకు 264, మణుగూరులోని 13షాపులకు 157, అశ్వారావుపేట 8షాపులకు 299 దరఖాస్తులు, బూర్గంపాడులోని 4 షాపులకు 102, వెంకటాపురంలోని 5 షాపులకు 61, భద్రాచలంలోని 11 షాపులకు 54 దరఖాస్తులు వచ్చాయి. నేడు లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు.. జిల్లాలోని 147 షాపులకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సీక్వెల్ ఫంక్షన్ హాల్లో లాటరీ పద్ధతిలో డ్రా తీస్తారు. ఇందులో గెలుపొందిన వారికి షాపులను కేటాయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్, ఎస్పీ ఎ.వి. రంగనాథ్ హాజరై లాటరీ పద్ధతిని ప్రారంబిస్తారు. అయితే భారీ సంఖ్యలో (3837) దరఖాస్తులు రావడంతో షాపుల కేటాయింపునకు రెండు రోజుల పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. డ్రా తీసే ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీంచేందుకు సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణతోపాటు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 250 మంది ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు పాల్గొంటున్నారు. షాపులు కేటాయించే క్రమంలో అధికారులు ఇచ్చిన హాల్‌టికెట్ ఉన్న దరఖాస్తుదారుడిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మైకు ద్వారా షాపుల కేటాయింపు ప్రకటన చేస్తారు. పార్క్ హోటల్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్‌ను చేసుకోవాల్సి ఉంటుంది. బందోబస్తును ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఫంక్షన్‌హాలులో ఒకేసారి 14 స్టేషన్లకు సంబంధించి టెండర్ బాక్సులను ఓపెన్ చేసేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని డిప్యూటీ కమిషనర్ కె.మహేష్‌బాబు తెలిపారు. మొదటిగా సింగిల్ డిజిట్ నెంబర్లను డ్రా తీస్తారని పేర్కొన్నారు. ఏజెన్సీలోని షాపులకు తీర్మానాలు లేకపోతే కమిషనర్ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు సీక్వెల్ ఫంక్షన్ హాలును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్ , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రీతమ్, ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, వన్‌టౌన్ సీఐ రమణమూర్తి, ట్రాఫిక్ ఎస్ఐ గోపి తదితరులున్నారు. మాటేసిన డాన్లు.. మద్యం షాపులకు టెండర్లు నిర్వహిస్తున్న తరుణంలో మద్యం డాన్లు చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. తాము టెండర్ దాఖలు చేసిన షాపులు దక్కకపోతే డ్రాలో గెలుపొందిన వారినుంచి షాపులు చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా తమకు అనుకూలమైన షాపులను దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అప్పడే మొదలైన కొత్త షాపుల ప్రతిపాదన లు..! రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో ఉన్న 9 షాపులను సీమాంధ్రకు కలిపారు. వాటికి బదులుగా జిల్లాలో మరో 9 కొత్త షాపులు ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. మొదటి విడతగా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం లేదా మద్దులపల్లి, చింతకాని, నేలకొండపల్లి మండలాల్లో మూడు షాపులకు జాలై మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు ఫైల్ సిద్దం చేసినట్లు తెలిసింది. -
రంగంలోకి మద్యం మాఫియా !
కామారెడ్డి: జిల్లాలో మొత్తం 130 మద్యం దుకాణాలకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో నిజామాబాద్ సూపరింటెండెంట్ పరిధిలో 93 దుకాణాలు, కామారెడ్డి సూపరింటెండెంట్ పరిధిలో 37 దుకాణాలున్నాయి. 2014-15 సంవత్సరానికి గాను ఫిక్స్డ్ లెసైన్స్ పద్ధతిపై దుకాణాలను లాటరీ పద్ధతిన కేటాయించనున్నారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన మద్యం మాఫియా జిల్లాలో ముఖ్యమైన దుకాణాలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఎక్కువగా అమ్మకాలు సాగే దుకాణాలను కైవసం చేసుకునేందుకు గాను ఆయా దుకాణాలపై తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అత్యధిక టెండర్లు వేయించడానికి రంగం సిద్ధం చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మద్యం మాఫియాకు చెందిన కొందరు జిల్లాలోని పలు దుకాణాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన వారితో మంతనాలు జరిపారని సమాచారం. ఎవరికీ దక్కినా తమ వాటా ఉండాలని ఒప్పందం గతంలో జిల్లాలో మద్యం దుకాణాలను సొంతం చేసుకుని అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించిన వ్యాపారులు ఈ సారి కూడా దుకాణాలు సొంతం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. కొన్ని దుకాణాలకు ఎక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉండడంతో ఎవరికీ దక్కినా తమ గ్రూపునకు వాటా ఉండాలనే ఒప్పందాలకు వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాలో మద్యం అమ్మకాల విషయంలో మాఫియా చెప్పిందే నడిచింది. అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మద్యం మాఫియాపై పెద్ద పోరాటమే చేశారు. తరువాత మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా పద్ధతి రావడంతో మాఫియా కు ఎక్కువ దుకాణాలు దక్కలేదు. రెండు సంవత్సరాలుగా వెనకడుగు వేసిన మద్యం మాఫి యా ఇప్పుడు మళ్లీ అడుగులు ముందుకు వేస్తోంది. ఈ సారి డ్రాలో ఎక్కువగా దుకాణాలు పొందడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. మరి మద్యం మాఫియా ఎత్తులు ఏమేరకు విజయవంతం అవుతాయో వేచిచూడాలి. -
లాటరీ పద్ధతిలోనే షాపులు
-
లాటరీ పద్ధతిలోనే షాపులు
- పాత ఎక్సైజ్ విధానంలోనే కేటాయింపు - ఈ నెల 21వరకు దరఖాస్తుల స్వీకరణ - 23న కలె క్టర్ ఆధ్వర్యంలో డ్రా - ఒక్కో దరఖాస్తుకు రూ.25 వేల ఫీజు మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: ఈ మారూ మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ పద్ధతిలోనే కొనసాగనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు పరుస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ ఉత్తర్వులు శనివారం జిల్లాకు చేరాయి. ఈ మేరకు అధికారులు షాపుల కేటాయింపు విధానానికి కసరత్తు చేయనున్నారు.ప్రస్తుతం జిల్లాలో 184 మద్యం షాపులు, ఏడు బార్లున్నాయి. వీటిని 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించనున్నారు. అప్పట్లో 50 వేల నుంచి 3లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో ఒక్కో మద్యం దుకాణానికి రూ.42 లక్షలు,50 వేలకు పైగా ఉన్న ప్రాంతాలకు 34 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలలో 32.5 లక్షలు లెసైన్స్ ఫీజులను శ్లాబ్‌ల వారీగా నిర్ణయించారు. ఈనెల 30 తో మద్యం దుకాణాలకు లెసైన్స్‌ల గడువు తీరనుంది. 194 మద్యం దుకాణాలకు.... 2014-15 సంవత్సర ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఎక్సైజ్‌శాఖా మంత్రి పద్మారావ్ ప్రకటించారు.గతంలో జిల్లాలో194 మద్యం షాప్‌లకు గాను 184 మద్యం షాప్‌లకు అధికారులు లాటరీ పద్దతిన వైన్‌షాప్‌లను ఎంపిక చేశారు.అప్పుడు మిగలిన 10 షాప్‌లతో కలిపి జూలైలో కొత్త విధానం ప్రకారం వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ పరిధిలో మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో వనపర్తి, అచ్చంపేట, ఆమన్‌గల్, కల్వకుర్తి, కొల్లాపూర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో పరిధిలో 57 వైన్ షాపులు ఉన్నాయి. గద్వాల డివిజన్ పరిధిలో కొత్తకోట, కొడంగల్, ఆత్మకూర్, నారాయణపేట, అలంపూర్‌లలో ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఈ ప్రాంతాల పరిధిలో 62 వైన్ షాపులు, రెండు బార్లున్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో షాద్‌నగర్, కొడంగల్, జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో 65 వైన్ షాపులు, ఏడు బార్లున్నాయి. 2012 సంవత్సరంలో డ్రా పద్ధతిన దుకాణాలను కేటాయించారు. ఏడాది తర్వాత అవే దుకాణాలను రెన్యువల్ చేశారు. ఈనెల 30 తో వాటి గడువు ముగుస్తుంది. టెండర్ల సమయంలో జిల్లా నుంచి 55 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గతంలో నిర్వహించిన మాదిరిగానే 7 విడతలలోనే మద్యాన్ని సరఫరా చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కొత్త పాలసీ ప్రక్రియను జూలై మొదటి వారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీసీ గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రతీ దరఖాస్తుకు 25వేల ఫీజును నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. 23న లాటరీ పద్ధతిన కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.