సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్-2021పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆత్మనిర్భర భారత్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సృజనాత్మకత, సామర్ధ్యం, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్‌ను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. ( బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!)
కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్లో కోవిడ్ వాక్సిన్ కోసం 35,400 కోట్ల రూపాయలు కేటాయించి ప్రధాని మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్ టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుంది. దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment