![The Last Devadasi Of Puri Temple Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/11/DEVADASI.jpg.webp?itok=tEfkuZlu)
దేవదాసి పరశమణి (ఫైల్)
భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని సంస్కృతిలో దేవదాసి సంస్కృతికి తెర పడింది. చిట్టచివరి దేవదాసి పరశమణి (87) పూరీలోని బలి సాహి కామాక్ష మందిరం దగ్గర అద్దె ఇంటిలో శనివారం తుదిశ్వాస విడిచింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఆమె మృతి చెందినట్లు సమాచారం. జగన్నాథునికి దేవదాసీగా అంకితమై శ్రీ మందిరంలో సంరక్షకురాలిగా తుదిశ్వాస వరకు ఆమె కొనసాగింది. 1955వ సంవత్సరంలో జగన్నాథ దేవస్థానంలో దేవదాసీ సంప్రదాయం ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment