
ప్రతీకాత్మకచిత్రం
అరిఫ్ భార్య ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ అక్కడే సహోద్యోగితో సన్నిహితంగా ఉండేదని, అతన్ని ఒకరోజు ఇంటికి తీసుకురాగా భర్త మందలించాడని చెప్పారు. ఇరువైపు పెద్దలూ పంచాయతీ చేసి ఆమెను మందలించారు.
బెంగళూరు: భార్య ప్రవర్తనను ప్రశ్నించిన భర్త అనుమానాస్పదంగా మరణించిన సంఘటన దేవనహళ్లి పరిధిలో చోటుచేసుకుంది. హెగ్గనహళ్లి వద్ద మంగళవారం ఉదయం హుండై కారుతో పాటు ఒక వ్యక్తి శవం సగం కాలిపోయి లభించింది. దేవనహళ్లి పోలీసులు మృతున్ని యలహంక నివాసి అరిఫ్ బాషాగా గుర్తించారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలను అందించారు.
గతంలో భార్య తీరుపై పంచాయతీ
అరిఫ్ యలహంకలో అపార్ట్‌మెంట్లో భార్య, కొడుకుతో కలిసి ఉండేవాడు. ఇక అరిఫ్ భార్య ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ అక్కడే సహోద్యోగితో సన్నిహితంగా ఉండేదని, అతన్ని ఒకరోజు ఇంటికి తీసుకురాగా భర్త మందలించాడని చెప్పారు. ఇరువైపు పెద్దలూ పంచాయతీ చేసి ఆమెను మందలించారు. అరిఫ్ భార్యను పుట్టింటికి పంపించాడు. సోమవారం సాయంత్రం బయటకు వెళ్లిన అరిఫ్ మంగళవారం ఉదయం హెగ్గనహళ్లి వద్ద కారుతోపాటు కాలిపోయాడు. భార్యే హత్య చేయించి ఉంటుందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది.
చదవండి: (రూ.20పై మూడేళ్ల పోరాటం.. రిటైర్డు టీచర్‌కు దక్కిన విజయం)