burnt body
-
అక్కడ దహనమైంది ఏమిటో!
యడ్లపాడు: కొండవీడు రిజర్వు ఫారెస్టు కొండల సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారన్న వార్త మండలంలో కలకలం రేపింది. యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామంలోని సచివాలయం వెనుకవైపు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని శుక్రవారం పోలీసులకు గొర్రెల కాపరులు సమాచారం ఇచ్చారు. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ పి శ్రీనివాసరెడ్డి, యడ్లపాడు ఎస్ఐ జె శామ్యూల్ రాజీవ్‌కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గ్రామ సచివాలయం వెనుక అటవీ ప్రాంతంలోని పూలలొద్ది ఆంజనేయస్వామి గుడి కొండవీడు కొండల నడుమ అనుమానాస్పదంగా కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి. సుమారు 4 అడుగుల వైశాల్యంలో కాల్చిన బూడిద, అందులో బొగిలిపోయిన ఎముకలు, ఘటనా స్థలికి కొద్దిదూరంలో ఓ పుర్రె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లా అధికారులకు సమాచారం అందించి క్లూస్ టీంను పిలిపించారు. సంఘటనా స్థలంలోని పలు ఆధారాలను క్లూస్‌టీం అధికారులు సేకరించారు. వీఆర్వోల ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. సీఐ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన గొర్రెలకాపరులు ఇచ్చిన సమాచారం మేరకు తాము శుక్రవారం సంఘటనా స్థలాన్ని చేరుకున్నామన్నారు. సంఘటనా స్థలంలో బాగా కాల్చడంతో కనీస ఆనవాళ్లను గుర్తించ లేకపోతున్నామన్నారు. దగ్ధమైన సంఘటన మాత్రం కనీసం మూడు రోజులు కిందట జరిగి ఉంటుందని భావిస్తున్నామని వివరించారు. అలాగే ఎముకలు చిన్నవిగా అందులోనూ నల్లగా మారిపోయి ఉండటంతో ఇవి మనిíÙవా లేక ఏదైన వన్య ప్రాణిదా అన్న విషయాన్ని తేల్చలేకపోతున్నామన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆ స్థాయిలో దగ్ధం చేయడానికి కారణాలు ఏమిటో తెలియాలంటే ముందుగా క్లూస్ టీం సేకరించిన ఫొరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఇచ్చిన ఆధారాలతో కేసు దర్యాప్తు ముందుకు పోతుందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమన్నారు. -
శంషాబాద్‌లో దారుణం.. కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు మహిళపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. కాగా, పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళలు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పడేసినట్టు తెలిపారు. మహిళ ఎవరు ఎందుకు హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళ కోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఏవైనా నమోదయ్యాయా, మహిళకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలు క్షుణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మహిళ 35, 36 సంవత్సరాలు వయసుగా ఉంటుంది. కాళ్లకు మెట్టలు ఉండడంతో వివాహమైన మహిళగా ప్రాథమిక గుర్తించామన్నారు. హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా లేదంటే ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి నిప్పు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య, శరణ్యను కిరాతకంగా.. -
రాజస్తాన్‌లో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం
జైపూర్: రాజస్తాన్‌లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. దీంతో, వారు బట్టీలు నిర్వహించే కల్బేరియా తెగకు చెందిన అయిదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోట్రి పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. -
పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం
కోల్కత్తా: పెళ్లి బాజాలు మోగాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో వివాహం జరుగుతుందనగా.. అనుమానాస్పద స్థితిలో పెళ్లికొడుకు సహా అతడి అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతంలో హఫ్నా సోరెన్ కుటుంబం నివాసం ఉంటుంది. హఫ్నా సోరెన్‌కు ఇద్దరు కుమార్తెలు(సుమీ సోరెన్, బహమనీ సోరెన్) ఓ కుమారుడు(మంగళ్ సోరెన్) ఉన్నారు. కాగా, కుమారుడు మంగళ్ సోరెన్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫు కుటుంబసభ్యులు మంగళ్ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు. అయితే, పెళ్లి పనుల్లో భాగంగా హఫ్నా సోరెన్ శనివారం ఉదయం బయటకు వెళ్లారు. ఇక, ఆయన ఇంటి తిరిగి వచ్చే సరికి వారి ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే సమయంలో ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. దీంతో, వెంటనే ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు. వారు ముగ్గురు మంటల్లో సజీవ దహనమయ్యారు. కాగా, హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు -
సహోద్యోగితో సన్నిహితంగా.. ఏకంగా ఇంటికే తీసుకురావడంతో..
బెంగళూరు: భార్య ప్రవర్తనను ప్రశ్నించిన భర్త అనుమానాస్పదంగా మరణించిన సంఘటన దేవనహళ్లి పరిధిలో చోటుచేసుకుంది. హెగ్గనహళ్లి వద్ద మంగళవారం ఉదయం హుండై కారుతో పాటు ఒక వ్యక్తి శవం సగం కాలిపోయి లభించింది. దేవనహళ్లి పోలీసులు మృతున్ని యలహంక నివాసి అరిఫ్ బాషాగా గుర్తించారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలను అందించారు. గతంలో భార్య తీరుపై పంచాయతీ అరిఫ్ యలహంకలో అపార్ట్మెంట్లో భార్య, కొడుకుతో కలిసి ఉండేవాడు. ఇక అరిఫ్ భార్య ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ అక్కడే సహోద్యోగితో సన్నిహితంగా ఉండేదని, అతన్ని ఒకరోజు ఇంటికి తీసుకురాగా భర్త మందలించాడని చెప్పారు. ఇరువైపు పెద్దలూ పంచాయతీ చేసి ఆమెను మందలించారు. అరిఫ్ భార్యను పుట్టింటికి పంపించాడు. సోమవారం సాయంత్రం బయటకు వెళ్లిన అరిఫ్ మంగళవారం ఉదయం హెగ్గనహళ్లి వద్ద కారుతోపాటు కాలిపోయాడు. భార్యే హత్య చేయించి ఉంటుందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది. చదవండి: (రూ.20పై మూడేళ్ల పోరాటం.. రిటైర్డు టీచర్‌కు దక్కిన విజయం) -
శవాలు కాల్చి.. నదిలో పడేసి!
న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడిలో తమవైపు పెద్దగా నష్టం జరగలేదని చెప్పుకుంటున్న పాకిస్తాన్‌ది వట్టి బుకాయింపేనని తేటతెల్లమైంది. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ముష్కరుల మృతదేహాల్ని కాల్చివేసి సమీపంలోని నదిలో పడేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. భారత వైమానిక దళం దాడి ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని అతడు పూసగుచ్చాడు. సుమారు 3 నిమిషాల వ్యవధి గల ఆ వీడియోను రిపబ్లిక్ టీవీ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసినట్లు వీడియోలో ఉంది. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దులోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షి అందులో చెప్పారు. బాలాకోట్ సమీప నివాసిగా భావిస్తున్న సదరు వ్యక్తి ఈ దాడిలో మొత్తం ఎందరు హతమయ్యారో వెల్లడించకున్నా అందులో కొందరు తనకు తెలుసని, వారి చరిత్రతో సహా పేర్లు చదివి వినిపించాడు. వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అమానవీయంగా వ్యవహరించిన సైన్యం.. భారత వైమానిక దళం మిగిల్చిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. బాలాకోట్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న సైన్యం స్థానికులను భయపెట్టింది. వారి మొబైల్ ఫోన్లను లాక్కుంది. గాయపడిన ఉగ్రవాదుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ వారికి చికిత్స అందించడానికి వైద్యులను కూడా అనుమతించలేదు. వైద్యం అందించాలని వారు ఎంతో ప్రాధేయపడినా కనికరించలేదు. కార్ల నుంచి తీసిన పెట్రోల్‌తో చాలామటుకు శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారు. మరి కొన్నింటిని సంచుల్లో చుట్టి సమీపంలోని కున్హర్ నదిలో పడేశారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో చాలా మంది జైషే సభ్యులే. ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దుకు తరలించారు. ఈ దాడితో ఐఎస్ఐ, జైషే సభ్యులను భయం పట్టుకుంది. ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా నివారించేందుకు అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అయినా కొన్ని చిత్రాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఇలాగే దాడికి దిగుతూ ముష్కరులను చంపుతూ ఉంటే, మాకు త్వరలోనే ఉగ్రవాదం బెడద తొలగిపోతుంది. అక్కడ 263 మంది ఉగ్రవాదులు భారత యుద్ధవిమానాలు దాడికి దిగడానికి ఐదు రోజుల క్రితం బాలాకోట్ శిబిరంలో 263 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లు అక్కడే ఉన్నట్లు టైమ్స్ నౌ మీడియా తెలిపింది. ప్రాథమిక శిక్షణకు 83 మంది, అడ్వాన్స్ శిక్షణకు 91 మంది, ఆత్మాహుతి దాడిలో శిక్షణకు 25 మంది ఆæ శిబిరానికి వచ్చినట్లు వెల్లడించింది. మరో 18–20 మంది దాకా వంటగాళ్లు, క్షురకులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. బాలాకోట్‌లో 263 మంది ఉగ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు ధ్రువీకరించుకున్న తరువాతే వైమానిక దళం దాడికి దిగిందని తెలిపింది. అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వైమానిక దాడిలో కనీసం నలుగురు పాకిస్తాన్ సైనికులు కూడా మృత్యువాతపడినట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పోలీసులు, బాలాకోట్ మత గురువులకు ఫోన్‌చేయగా భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన సంగతి నిజమేనని చెప్పినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది. -
మామిడి తోటలో కాలిన మృతదేహం
విజయనగరం జిల్లా జామి మండలంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని చంపి కాల్చేశారు. మండలంలోని అన్నంరాజుపేట గ్రామ సమీపంలోని మామిడితోటలో దాదాపు పూర్తిగా కాలిపోయిన మృతదేహం శుక్రవారం స్థానికుల కంటబడింది. ఘటనా స్థలంలో మద్యం సీసాలు పడి ఉన్నాయి. ఈ విషయమై వారు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.