‘దీపావళి నాడు బిర్యానీ షాప్‌ తెరిచావ్‌.. తగలబెట్టాలా’ | Man Forces Biryani Shop In Delhi To Shut On Diwali | Sakshi
Sakshi News home page

‘దీపావళి నాడు బిర్యానీ షాప్‌ తెరిచావ్‌.. తగలబెట్టాలా’

Published Sat, Nov 6 2021 9:16 PM | Last Updated on Sat, Nov 6 2021 9:22 PM

Man Forces Biryani Shop In Delhi To Shut On Diwali - Sakshi

న్యూఢిల్లీ: దీపావళి పండుగ నాడు నువ్వు బిర్యానీ షాప్‌ తెరుస్తావా.. నీకు ఏ మాత్రం భయంలేదా.. షాప్‌ తగలబెట్టాలా చెప్పు అంటూ ఓ వ్యక్తిని బెదిరించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. ఈ సంఘటన ఢిల్లీ, సంత్‌ నగర్‌లో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఓ బిర్యానీ షాప్‌ని దీపావళి నాడు కూడా తెరిచారు. 

ఈ క్రమంలో కొందరు వ్యక్తులు బిర్యానీ షాప్‌కి వచ్చి ‘‘నువ్వు షాప్‌ తెరిచావ్‌.. నీకు అనుమతి ఎవరిచ్చారు.. ఈ రోజు దీపావళి పండుగ.. అయినా కూడా నువ్వు నీ బిర్యానీ షాప్‌ తెరిచావు. నీకు భయం లేదా.. వెంటనే నీ దుకాణం ముసేయ్‌.. లేదంటే తగలబెడతాం’’ అని హెచ్చిరించారు.
(చదవండి: సీఎం ట్వీట్‌పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’)

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. వీడియో కాస్త వైరల్‌ కావడంతో ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. దీని గురించి ఎవరు తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. 

చదవండి: ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement