మీడియాతో మాట్లాడుతున్న అడిషనల్ ఎస్పీ
దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చాని కొందరు మృగాలు మాత్రం మారడంలేదు. మహిళలు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. జరిగిన అవమానం భరించలేక బాధితులు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైనర్(16)పై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. బాధితురాలు ఈ నెల 9వ తేదీన తన తండ్రితో కలిసి బయటకు వెళ్తోంది. ఇంతలో ఒద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆమె తండ్రిపై దాడి చేసి.. మైనర్‌ను సమీప అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. కాగా, అటవీ ప్రాంతంలో అంతకుముందే ఉన్న మరో ఇద్దరు వారితో కలిసి.. నలుగురు వ్యక్తులు మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను అటవీ ప్రాంతంలోనే వదిలి వెళ్లిపోయారు.
జరిగిన విషయాన్ని బాధితురాలు తండ్రి గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఊరి పెద్దలు పంచాయితీ పెట్టారు. జరిగిన విషయం ఎంతో బాధాకరం. జరిగిందేదో జరిగిపోయింది.. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం కింద నిందితులు
రూ.లక్ష ఇవ్వాలని తీర్మానించారు. ఈ విషయం పోలీసుల దాకా పోవద్దు.. ఇక్కడితోనే ముగిసిపోవాలని ఇరు వర్గాలను కోరారు. కాగా, జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలియడంతో నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రతిభా పాండే చెప్పారు.
Jashpur, Chhattisgarh | 16-year-old minor was allegedly gang-raped. Incident is of July 9, but a transaction of Rs 1 lakh was being done to silence things. We reached family & conducted medical of victim. Accused in custody, further investigation is ongoing: Pratibha Pandey, ASP pic.twitter.com/Sb5QzRZM52
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 11, 2022
ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్‌తో రచ్చ రచ్చ.. వీడియోపై ట్రోలింగ్స్
Comments
Please login to add a commentAdd a comment