భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. తాజాగా ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు.
ఒడిశాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. అధికార దాహంతో, విభజన శక్తులు గణపతి పూజను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అప్పట్లో దేశాన్ని విభజించు పాలించు అనే విధానాన్ని అనుసరించిన బ్రిటీషర్లు గణపతి ఉత్సవాల్ని వ్యతిరేకించేవారు. నేటికీ సమాజాన్ని విభజించి విచ్ఛిన్నం చేసే పనిలో నిమగ్నమైన కొందరు అదే దారిలో పయనిస్తున్నారు.
గణేష్ ఉత్సవం కేవలం మతపరమైన పండుగ కాదని, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రాత్మకంగా కీలక పాత్ర పోషించిందని పున రుద్ఘాటించారు. బ్రిటీషర్లు భారతీయుల మధ్య చిచ్చుపెట్టి తద్వారా విభజించి పాలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గణపతి ఉత్సవాలు ఐక్యతకు చిహ్నంగా నిలిచాయని గుర్తు చేశారు.
గణేష్ ఉత్సవాల్ని వ్యతిరేకించాలనుకునే మనస్తత్వాన్ని మోదీ ఖండించారు. అలాంటి వారు సమాజంలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : అతిషీ డమ్మీ సీఎం
Comments
Please login to add a commentAdd a comment