Ganpati festival
-
గణపతి పూజ.. ప్రతిపక్షాల విమర్శలపై ప్రధాని మోదీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. తాజాగా ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు.ఒడిశాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. అధికార దాహంతో, విభజన శక్తులు గణపతి పూజను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అప్పట్లో దేశాన్ని విభజించు పాలించు అనే విధానాన్ని అనుసరించిన బ్రిటీషర్లు గణపతి ఉత్సవాల్ని వ్యతిరేకించేవారు. నేటికీ సమాజాన్ని విభజించి విచ్ఛిన్నం చేసే పనిలో నిమగ్నమైన కొందరు అదే దారిలో పయనిస్తున్నారు. గణేష్ ఉత్సవం కేవలం మతపరమైన పండుగ కాదని, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రాత్మకంగా కీలక పాత్ర పోషించిందని పున రుద్ఘాటించారు. బ్రిటీషర్లు భారతీయుల మధ్య చిచ్చుపెట్టి తద్వారా విభజించి పాలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గణపతి ఉత్సవాలు ఐక్యతకు చిహ్నంగా నిలిచాయని గుర్తు చేశారు. గణేష్ ఉత్సవాల్ని వ్యతిరేకించాలనుకునే మనస్తత్వాన్ని మోదీ ఖండించారు. అలాంటి వారు సమాజంలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి : అతిషీ డమ్మీ సీఎం -
సీజేఐ ఇంట గణేష్ పూజలో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
సంచలనం సృష్టిస్తున్న వీడియో
పుణె: వినాయక నిమజ్జన ఉత్సవం ఇటీవలనే ముగిసిపోయినప్పటికీ అది చాటి చెప్పిన ఓ మానవీయ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా చక్కెర్లు కొడుతోంది. కాషాల జెండాలు, వస్త్రాలు ధరించిన భక్తులు, భజనపరులు డప్పుల దరువులకు గంతులేస్తుండగా, వారి చుట్టూ వేలాది మంది ప్రజలు ఇసుకకూడా రాలనంతగా కిక్కిర్సిపోయి ఉన్నప్పుడు అటుగుండా ఓ అంబులెన్స్ వచ్చింది. దానికి జన సముద్రం రెండుగా చీలిపోయి దారిచ్చింది. కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్చేయగా, దీన్ని ఇప్పటికే పది లక్షల మందికిపైగా చూశారు. రెండు రోజుల్లో 40 వేల మందికిపైగా షేర్ చేసుకున్నారు. పుణెలో వినాయక నిమజ్జనం రోజున తీసిన ఈ రెండు నిమిషాల నిడివిగల వీడియో విదేశాల్లో వింతకాకపోవచ్చు. భారత్‌లాంటి దేశంలో, అందులోనూ వినాయక నిమజ్జనం రోజున ఇలాంటి మానవత్వాన్ని చాటిచెప్పే సంఘటనలు చాలా చాలా అరదు. ఆరోజున ట్రాఫిక్ ఎంతగా స్తంభించిపోతుందో, పొరపాటున అత్యవసరమై వచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వారి అవస్థలు మనకు అనుభవపూర్వకమే. వీఐపీలకు కూడా ఆరోజు దారిచ్చే దారులుండవు. -
సంచలనం సృష్టిస్తున్న వీడియో
-
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ పరుగులు
సాక్షి, ముంబై: గణేష్ ఉత్తవాలను పురస్కరించుకుని కొంకణ్‌కు డబుల్ డెక్కర్ ఏసీ రైలు పరుగులు తీసింది. అయితే రైల్వే అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల మొదటి రోజు ఆ రైలు గంటా 15 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. వివరాలిలా ఉన్నాయి. గణేష్ ఉత్సవాల కారణంగా రెగ్యూలర్‌తోపాటు ప్రత్యేకంగా నడిపే రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. దీంతో కొంక ణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ (ఎల్టీటీ) నుంచి కర్మాలి (గోవా) వరకు డబుల్ డెక్కర్ ఏసీ రైలు నడుపుతున్నట్లు ఇదివరకే రైల్వే పరిపాలన విభాగం ప్రకటించింది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారు జాము 5.30 గంటలకు కుర్లా టర్మినస్ నుంచి బయలుదేరిన రైలు ఉదయం 8.40 గంటలకు రోహా స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డు మారుతారు. కాని సెంట్రల్, కొంకణ్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో రోహా స్టేషన్లో కేవలం గార్డు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో కుర్లా నుంచి రైలును తీసుకెళ్లిన సెంట్రల్ రైల్వే డ్రైవర్ తాను రైలును ముందుకు తీసుకెళ్లలేనని మొండికేశాడు. దీంతో 75 నిమిషాలు రైలు అక్కడే నిలిచిపోయింది. అప్పటికే ఆ రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఏం జరిగిందో ప్రయాణికులకు తెలియదు. ఎనౌన్స్మెంట్ కూడా చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చివరకు సెంట్రల్ రైల్వే అధికారులతో చర్చలు జరిపి ఆ డ్రైవర్‌కు నచ్చజెప్పడంతో 9.55 గంటలకు రైలు ముందుకు కదలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.