
సాక్షి, ఢిల్లీ: రైతు సంఘాలతో రేపు (బుధవారం) చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. మంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఆయన నివాసంలో మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. రైతులతో చర్చించాల్సిన అంశాలపై మంతనాలు జరిపారు. (చదవండి:వెనక్కి తగ్గిన రజనీ.. కమల్ కామెంట్)
కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాల నేతలు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు వస్తామని కిసాన్ మోర్చా లేఖ రాసింది. నూతన వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతు సంఘాలు 4 అంశాల ఎజెండాను కేంద్రం ముందు ఉంచాయి.