Telangana: నిజామాబాద్‌ ప్రభుత్వ మహిళా ఐటీఐ టాప్‌ | Nizamabad Govt Women ITI Top In Telangana State | Sakshi
Sakshi News home page

Telangana: నిజామాబాద్‌ ప్రభుత్వ మహిళా ఐటీఐ టాప్‌

Feb 3 2023 8:19 AM | Updated on Feb 3 2023 8:39 AM

Nizamabad Govt Women ITI Top In Telangana State - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని మొత్తం 295 ఐటీఐల్లో నిజామాబాద్‌ ప్రభుత్వ మహిళా ఐటీఐ 3.18 గ్రేడ్‌తో అగ్రస్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్‌ తెలిపింది. ఈ ఒక్క ఐటీఐ మినహా రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు అన్నీ 2.5 కంటే తక్కువ గ్రేడ్‌లు పొందాయి. 196 ప్రైవేట్‌ ఐటీఐలలో 2 మాత్రమే 2.5 కంటే ఎక్కువ గ్రేడ్‌లు, 88 ప్రైవేట్‌ ఐటీఐలు 1 కంటే తక్కువ గ్రేడ్‌లు పొందాయి. ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌– స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ వర్టికల్‌’పేరుతో నీతిఆయోగ్‌ సిద్ధం చేసిన నివేదికలో రాష్ట్రాల్లోని ఐటీఐలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు.

తెలంగాణలోని ఇతర జిల్లాల కంటే హైదరాబాద్‌లోనే అత్యధిక ఐటీఐలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఐటీఐలతో పోలిస్తే ప్రైవేట్‌ ఐటీఐలలో అందించే ట్రేడ్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2022 సంవత్సరంలో రాష్ట్రంలోని 295 ఐటీఐల్లో 66 ప్రభుత్వ ఆధ్వర్యంలో, 77% ప్రైవేట్‌ నిర్వహణలో ఉన్నాయి. మహిళా ఐటీఐలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. 2020 సంవత్సరంలో 3,976 మంది ట్రైనీలు సర్టిఫికెట్లు అందుకున్నారు. కాగా, 2021 సంవత్సరంలో మొత్తం 54,340 సీట్లలో 50% మాత్రమే భర్తీ కావడంతో ఐటీఐలు పూర్తి సామర్థ్యంతో పనిచేయట్లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement