భవనేశ్వర్: జిల్లాలోని కలిమెల పంచాయతీ ఈఓగా పని చేస్తున్న తనకు గత 18 నెలలుగా వేతనం అందడం లేదని మధు హంతాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం సమితి కార్యాలయం ముందు బైఠాయించారు. గిరిజనుడినైన తన ఎల్‌పీసీని అధికారులు కలిమెల సమితికి పంపక పోవడంతో జీతం నిలిచి పోయిందని వాపోయారు.
తనకు న్యాయం చేయాలని ఎన్ని వినతులు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, గత ఏడాదిన్నరగా అప్పులు చేసి, కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోయారు. పిల్లల చదువులు సైతం భారంగా మారిందన్నారు. తన తండ్రిని మావోయిస్టులు నాలుగేళ్ల క్రితం హత్య చేశారని, అధికారులు స్పందించకపోతే కుటంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment