ముంబై: అది సాయంత్రం.ఇద్దరు దంపతులు కంగారుగా ముంబైలోని హింజెవాడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సార్ సార్ నా పేరు జమల్ కమల్ ఖాన్ మేమిద్దరం ప్రార్ధనల్ని ముగించుకొని తిరిగి వస్తుండగా నా భార్యను వేధించారంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.అ తర్వాత ఆ ఇద్దరు దంపతులే వాకాడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.మళ్లీ భర్త పోలీసులతో ఇలా.. సార్ మేం బైక్‌పై వెళుతుంటే కొంతమంది అగంతకులు నా భార్య మెడలో చైన్ కొట్టేశారు.న్యాయం చేయండి అని ఎస్సైని కోరారు.
దీంతో స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకొని,దంపతుల‍్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లండి అంటూ సిబ్బందిని ఆదేశించారు.ఈ సారి పింప్రి పోలీస్ స్టేషన్‌కి సార్ కరోనా పేషెంట్‌ను అంబులెన్స్‌లో తీసుకొని వెళ్లమని అడుగుతుంటే రూ.8 వేలు లంచం అడుగుతున్నాడు. డ్రైవర్ పై కేసు నమోదు చేయండి కోరాడు. కానీ పోలీసులు మాత్రం మేం ఏం చేయలేం. ఇది మాస్టేషన్ పరిధిలోకి రాదు మీరు మీ పరిధి స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.దీంతో ఆగ్రహానికి గురైన భర్త తన అసలు రూపం చూపించాడు. అంతే స్టేషన్ ఉన్నతాధికారులు, సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి ఆ ఇద్దరు ఏం కొంపముంచుతారోనని. అనుకున్నట్లు స‍్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు.
ఇంతకీ ఆ దంపతులు ఎవరో తెలుసా? భర్త ముంబై పింప్రి పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాష్ అయితే భార్య అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రేర్నా కట్టేలు. భార్య భర్తలైన వీళ్లిద్దరు పోలీస్ ఉన్నతాధికారులు. సామాన్యులుగా వెళితే స్టేషన్ పోలీసులు ఎలా ఉంటారు.ఎలా బిహేవ్ చేస్తారోనని తెలుసుకునేందుకు మూడు పోలీస్ స్టేషన్లకి ముస్లిం దంపతుల్లా మారు వేషంలో వెళ్లారు. భర్త కృష్ణ ప్రకాష్ ముస్లిం వేషదారణలో పెట్టుడు గడ్డం పెట్టుకోగా, భార్య ప్రేర్నా సాధారణ గృహిణిగా వెళ్లారు. అయితే మూడు స్టేషన్ల తనిఖీల అనంతరం ప్రెస్ మీట్‌లో తన వేషదారణ తొలగించారు. హింజెవాడి పోలీస్ స‍్టేషన్, వాకాడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు వ్యవహరించిన తీరుపై అభినందనలు తెలిపగా.. పింప్రి స్టేషన్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఉన్నతాధికారులు తీరు ముంబై పోలీస్ శాఖలోనే కాదు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది.
ఇది చదవండి : ఈటలతో కాంగ్రెస్ నేత భేటీ, టీపీసీసీకి షాక్ తప్పదా?
Comments
Please login to add a commentAdd a comment