కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్ర‌త్యేక‌ పూజ‌లు | PM-Modi Participates-Ganesh Utsav-Celebrations-Union-Minister Piyush Goyal House | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్ర‌త్యేక‌ పూజ‌లు

Sep 15 2026 2:18 AM | Updated on Sep 15 2026 3:08 AM

PM-Modi Participates-Ganesh Utsav-Celebrations-Union-Minister Piyush Goyal House

Photo Credit: Twitter

సోమవారం వినాయ‌క చ‌వితి పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు. ఢిల్లీలోని పీయూష్ గోయ‌ల్ ఇంటికి వెళ్లిన మోదీ గ‌ణ‌ప‌తి బ‌ప్పాను ద‌ర్శించుకున్నారు. అనంత‌రం హారతి ఇచ్చి నైవేద్యం స‌మ‌ర్పించారు. 

ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలుపుతూ గ‌ణేశుడి కృప అంద‌రిపై ఉండాల‌ని ప్ర‌ధాని మోదీ ఆకాంక్షించారు. అనంత‌రం గ‌ణ‌ప‌తి బొప్ప మోరియా అని మోదీ త‌న నోటి వెంట ప‌లికారు. ఈ సంద‌ర్భంగా పీయూష్ గోయ‌ల్ ఇంట్లో గ‌ణేషుడికి చేసిన పూజ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా త‌న ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్రధాని మోదీ స్పందిస్తూ..‘‘నా తోటి పౌరులందరికీ హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. విఘ్న నివారకుని దర్శన పూజలకు సంబంధించిన ఈ పవిత్ర పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లోకి నూతన శక్తిని, తాజా ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఆయన దివ్య ఆశీస్సులతో అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ముగించారు.

ఇదీ చదవండి: గురుగ్రామ్‌ ఘటన.. సియా కుటుంబం చెప్పిన మరో కోణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement