RBI Container Trucks With Over Rs 1,000 cr Stranded Due To Snag, Details Inside - Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత​, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం

Published Thu, May 18 2023 11:40 AM | Last Updated on Thu, May 18 2023 12:01 PM

RBI container trucks with over Rs 1,000 cr stranded due to snag - Sakshi

సాక్షి, చెన్నై: రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి విల్లుపురం వైపుగా రూ. 1000 కోట్ల నగదుతో వెళ్తున్న కంటైనర్‌ మార్గం మధ్యలో మరమ్మతులకు గురైంది. దీంతో ఆ వాహనానికి కట్టుదిట్టమైన భద్రతను కలి్పంచారు. వివరాలు.. చెన్నై రిజర్వు బ్యాంక్‌ నుంచి విల్లుపురం వైపుగా ఓ బ్యాంక్‌కు రూ. వెయ్యికోట్ల నగదును తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ఈ నగదు తో రెండు కంటైనర్లు భారీ భద్రత నడుమ బుధవారం చెన్నై నుంచి బయలుదేరాయి. అయితే తాంబరం శానిటోరియం వద్ద ఓ వాహనం మరమ్మతుకు గురైంది. రోడ్డు మీద ఈ వాహనం హఠాత్తుగా ఆగడంతో  భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వెంటనే ముందుగా వెళ్తు న్న మరో కంటైనర్‌ను కూడా ఆపివేశారు. కంటైన ర్‌ మరమ్మతుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిద్ధ వైద్య కళాశాలలోకి ఆ వాహనాలను తీసుకెళ్లారు. తాంబరం పోలీసులు వాటికి భద్రత కల్పిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement