
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్ రాణాకు భారీ ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. ఆమె తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించి, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారని బాంబే హైకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సదరు సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ జూన్ 9న తీర్పునిచ్చింది. ఆమెకు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది.
చదవండి: ప్రధాని కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవు