కరోనాతో సితార్‌ విద్వాంసుడు కన్నుమూత | Sitar Maestro Pandit Devabrata Chaudhuri Dies Of Covid | Sakshi
Sakshi News home page

కరోనాతో సితార్‌ విద్వాంసుడు కన్నుమూత

Published Sat, May 1 2021 10:04 PM | Last Updated on Sat, May 1 2021 10:05 PM

Sitar Maestro Pandit Devabrata Chaudhuri Dies Of Covid - Sakshi

కరోనా బారినపడి మరో ప్రముఖుడు మృతి. ఆయన మృతితో సితార్‌ లోకం మూగబోయింది.

న్యూఢిల్లీ: కరోనా ధాటికి మరో ప్రముఖుడు కన్నుమూశాడు. ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత దేవబ్రత చౌదరి (85) మృతిచెందారు. తన తండ్రి మరణించినట్టు ఆయన కుమారుడు ప్రతీక్‌ చౌదరి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ తేలగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న ఆయన ఆక్సిజన్‌ స్థాయి శుక్రవారం ఒక్కసారిగా పడిపోయింది. సంగీత ప్రపంచానికి పండిత్‌ దేవబ్రత చౌదరి అరవై ఏళ్ల పాటు విశేష సేవలందరించారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌, సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఆయన మృతికి కేంద్ర సాంస్కృతిక శాఖ సంతాపం ప్రకటించింది. 

చదవండి: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత
చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement