టీచర్‌.. మీ స్టూడెంట్‌ని నా చివరి కోరిక తీరుస్తారా..! | Student Blackmail Teacher In Bengaluru | Sakshi
Sakshi News home page

టీచర్‌.. మీ స్టూడెంట్‌ని నా చివరి కోరిక తీరుస్తారా..!

Apr 13 2026 7:51 AM | Updated on Apr 13 2026 10:53 AM

Student Blackmail Teacher In Bengaluru

దొడ్డబళ్లాపుర(కర్ణాటక): ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడు, మహిళ (40) చేత బలవంతంగా న్యూడ్‌ కాల్‌ చేయించి, ఆపై బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. ఈ సంఘటన బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలో జరిగింది. వివరాలు.. ఎల్రక్టానిక్‌ సిటీల టీచర్‌గా పని చేస్తున్న ఆమెకి, ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చెందిన యువకుడు అర్షద్‌ (37) ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థిని అని చెప్పుకుని కొంతకాలం మంచివాడిగా చాటింగ్‌ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్‌ వచ్చిందని, చివరి కోరికగా నీతో  గడపాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్‌గా వీడియో కాల్‌ అయినా చేయాలని కోరాడు.  

 

వీడియో సేవ్‌ చేసుకుని..  
అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్‌ చేసింది. అయితే కాల్‌ను రికార్డు చేసుకున్న దుండగుడు.. నీ న్యూడ్‌ వీడియో నా వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిరాలు తరచుగా అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే కొన్నిరోజులుగా వేధింపులు పతాకస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనల మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది, వెంటనే పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. తన అవయవాలను కోసుకుంటానని పోకిరీ కొంతసేపు హల్‌చల్‌ చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement