ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై/తిరువొత్తియూర్: విదేశాలలో రూ.2.50 లక్షల వేతనంతో పనిచేసేందుకు అర్హులైన నర్సులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విదేశీ ఉపాధి కల్పన సంస్థ డైరెక్టర్ మహేశ్వరన్ మంగళవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని ఆస్పత్రులలో నెలకు రూ. 2 లక్షల మొదలుకొని రూ. 2 లక్షల 50 వేల వరకు జీతంతో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అయిన మేల్ /ఫిమేల్ నర్సులు 500 మంది అవసరం ఉందన్నారు.
అదే విధంగా.. పదవ తరగతి పరీక్ష పాస్ అయిన వారు 30 సంవత్సరాల వయస్సు నుంచి 43 వయస్సు వరకు ఉన్న వారు ఐసీసీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు కువైట్‌లో పనిచేసేందుకు నోటిఫికేషన్ వెలువడిందని పేర్కొన్నారు. అలాగే నెలకు రూ. 27 వేల నుంచి రూ.34 వేల వరకూ జీతంతో పనిచేయుటకు సౌదీ అరేబియాలోని హోటల్స్‌లో వంట మనిషి (పురుషులు) కావాల్సి ఉందన్నారు.
ఇక కువైట్‌లో ఇంటి పనులు చేయుటకు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అవసరమని వీరికి నెలకు రూ.29,640 మొదలుకొని రూ. 32 వేల వరకు జీవం అందజేస్తారన్నారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, ఐటీఐ, ఫిట్టర్ పాసైన (22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారు) క్యాస్టింగ్ / ఇన్స్‌పెక్షన్ /మెకానిక్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఓమెన్ దేశంలో ఖాళీలు ఉన్నాయన్నారు. వారికి నెల రూ. 29 వేలు అందుతుందని తెలిపారు.
జీతం కాకుండా విదేశాలలో పని చేసేవారి వారికి భోజనం, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, విమాన టికెట్లను ఆయా దేశ ఉపాధి సంస్థల వారు ప్రత్యేకంగా అందజేచేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు www.omcmanpower.com వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను విదేశీ ఉపాధికల్పన సంస్థలు 0 4 4 2 2 5 0 5 8 8 6 /22 502267 అనే ఈ నంబర్ల ద్వారా తెలుకోవచ్చన్నారు. కాగా ఈ విదేశీ ఉపాధి కల్పన సంస్థ ఇప్పటి వరకు 10,350 మందిని వేరువేరు దేశాలకు ఉద్యోగులకు పంపించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment