Nurses posts
-
4 వేల నర్సుల పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు ప్రారంభించింది. వారం రోజుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ ఆధ్వర్యంలో పూర్తిగా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలో 4,400, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 700, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో దాదాపు 1,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో నాలుగు వేల పోస్టులకు పైనే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా వైద్యారోగ్యశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పచ్చజెండా ఊపారు. గతంలో 2017లో నర్సుల పోస్టుల భర్తీ జరిగింది. అప్పట్లో విడుదల చేసిన నోటిఫికేషన్లో వివిధ చిక్కులున్నాయని చాలా మంది గతంలో కోర్టులో కేసులు వేశారు. వైద్య,ఆరోగ్యశాఖకు కూడా చాలా ఫిర్యాదులు అందాయి. ఆ పోస్టులకు విపరీతమైన పోటీ ఇక నర్సింగ్కౌన్సిల్లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 25 శాతం మందికి పైగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మిగతా వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసినా, ఉద్యోగాలు లభించని పరిస్థితి నెలకొనడంతో కొందరు కోర్సుతో సంబంధంలేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భర్తీ చేయబోయే నర్సుల పోస్టులకు భారీ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
నర్సులకు నెలకు రూ.2.50 లక్షల జీతం!
సాక్షి, చెన్నై/తిరువొత్తియూర్: విదేశాలలో రూ.2.50 లక్షల వేతనంతో పనిచేసేందుకు అర్హులైన నర్సులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విదేశీ ఉపాధి కల్పన సంస్థ డైరెక్టర్ మహేశ్వరన్ మంగళవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని ఆస్పత్రులలో నెలకు రూ. 2 లక్షల మొదలుకొని రూ. 2 లక్షల 50 వేల వరకు జీతంతో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అయిన మేల్ /ఫిమేల్ నర్సులు 500 మంది అవసరం ఉందన్నారు. అదే విధంగా.. పదవ తరగతి పరీక్ష పాస్ అయిన వారు 30 సంవత్సరాల వయస్సు నుంచి 43 వయస్సు వరకు ఉన్న వారు ఐసీసీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు కువైట్‌లో పనిచేసేందుకు నోటిఫికేషన్ వెలువడిందని పేర్కొన్నారు. అలాగే నెలకు రూ. 27 వేల నుంచి రూ.34 వేల వరకూ జీతంతో పనిచేయుటకు సౌదీ అరేబియాలోని హోటల్స్‌లో వంట మనిషి (పురుషులు) కావాల్సి ఉందన్నారు. ఇక కువైట్‌లో ఇంటి పనులు చేయుటకు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అవసరమని వీరికి నెలకు రూ.29,640 మొదలుకొని రూ. 32 వేల వరకు జీవం అందజేస్తారన్నారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, ఐటీఐ, ఫిట్టర్ పాసైన (22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారు) క్యాస్టింగ్ / ఇన్స్పెక్షన్ /మెకానిక్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఓమెన్ దేశంలో ఖాళీలు ఉన్నాయన్నారు. వారికి నెల రూ. 29 వేలు అందుతుందని తెలిపారు. జీతం కాకుండా విదేశాలలో పని చేసేవారి వారికి భోజనం, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, విమాన టికెట్లను ఆయా దేశ ఉపాధి సంస్థల వారు ప్రత్యేకంగా అందజేచేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు www.omcmanpower.com వెబ్సైట్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను విదేశీ ఉపాధికల్పన సంస్థలు 0 4 4 2 2 5 0 5 8 8 6 /22 502267 అనే ఈ నంబర్ల ద్వారా తెలుకోవచ్చన్నారు. కాగా ఈ విదేశీ ఉపాధి కల్పన సంస్థ ఇప్పటి వరకు 10,350 మందిని వేరువేరు దేశాలకు ఉద్యోగులకు పంపించినట్లు పేర్కొన్నారు. చదవండి: మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
MK Stalin: స్టాలిన్ వరాల జల్లు.. వారికి గుడ్‌న్యూస్
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేలోపే ప్రభుత్వ పాలనలో మునిగిపోయారు. కరోనా పరిస్థితులను తెలుసుకుంటూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంగళవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే డిమాండ్‌పై అనేకసార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. డీఎంకే అధికారంలోకి వస్తే కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న నర్సులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న దశలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలు ఎంతో అవసరంగా మారిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ సోమవారం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న 1,212 మంది నర్సుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయనున్నట్లు స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని.. అంకిత భావంతో కరోనా విధులు నిర్వహించాలని స్టాలిన్ నర్సులను కోరారు. జర్నలిస్టులు ఇక ఫ్రంట్‌లైన్ వారియర్లు తమిళనాడులో వివిధ మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పరిగణిస్తామని స్టాలిన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విలేకరుల సేవలను కొనియాడారు. జర్నలిస్టుల హక్కులను కాపాడుతూ తగిన రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: MK Stalin: 7న స్టాలిన్ ప్రమాణం -
'నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తాం'
సుల్తాన్‌బజార్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమైందన్నారు. నర్సుల డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్ట్ నర్సులను పర్మినెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్కు సంబంధించి స్పెషలైజేషన్ కోర్సులను ప్రవేశపెడతామని చెప్పారు. -
రేపట్నుంచి నర్సుల రాష్ట్ర వ్యాప్త ఆందోళన
విశాఖ మెడికల్: నర్సుల నియామకాలు, ఇతర డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి తెలిపారు. విశాఖలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 31 నుంచి రాష్ట్ర వ్యాప్తం గా అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రుల ఎదుట గంట పాటు నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ధర్నాలు చేపట్టి దశలువారీగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. 2007 నుంచి ప్రభుత్వం పోస్టుల నియామకాలను నిలిపివేసిందని ఆరోపించా రు. ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది నర్సు పోస్టుల భర్తీ చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకూ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. గుంటూరు జీజీహెచ్ ఆస్ప త్రి ఘటనకు సంబంధించి ఇద్దరు నర్సులను సేవా లోపం నెపంతో సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.