
ఆ యువకునికి రీల్స్ చేయడం అంటే ఎడతెగని మోజు. వీటిని రూపొందించేందుకు లెక్కలేనన్ని ప్రయత్నాలు చేసేవాడు. అయితే ఈ తాపత్రయమే అతనికి శాపంగా పరిణమిస్తుందని అతను ఏనాడూ ఊహించలేదు.
మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడు రీల్స్ మోజులో ప్రాణాలుపోగొట్టుకున్నాడు. ఈ ఉదంతం డోంబీవలీ పరిధిలోని ఠాకురలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బ్రిటీష్ కాలం నాటి పంప్ హౌస్‌కు అనుసంధానంగా ఉన్న బావిపైకి ఎక్కిన ఒక యువకుడు దానిలోపడి మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన ఇద్దరు స్నేహితులతోపాటు తన సోషల్ మీడియా అకౌంట్‌లో రీల్స్ షూట్ చేసేందుకు ఈ బావి దగ్గరకు వచ్చాడు. ఈ ఘటన జూన్ 11న జరిగింది. అయితే ఆ యవకుని మృతదేహం 32 గంటల అనంతరం అంటే జూన్ 12న బావిలో నుంచి వెలికితీశారు. ఆ యువకుడిని బిలాల్ సోహెల్ షేక్(18)గా గుర్తించారు.
పోలీసులు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ రీల్స్ చేస్తున్న సమయంలో బిలాల్ బాలిలో పడిపోవడాన్ని గమనించిన అతన స్నేహితులు సమీపంలో ఉన్న సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లారు. వెంటనే అతను విష్ణునగర్ పోలీసులకు సమాచారం అందజేయడంతో పాటు బిలాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోయింది. కాగా ఆ యువకులు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.
బిలాల్ చిన్నాన్న ఖాలిద్ భాయీ మీడియాతో మాట్లాడుతూ బిలాల్ అతని స్నేహితులతో పాటు ఠాకురాలీ వెళ్లాడని, సాయంత్రం కాగానే ఇంటికి తిరిగివస్తాడని అనుకున్నామన్నారు. అయితే అతని స్నేహితులు తమకు బిలాల్ బావిలో పడిపోయిన విషయాన్ని తెలియజేశారన్నారు. బిలాల్ మరణించాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.
ఇది కూడా చదవండి: తండ్రి పంక్చర్ వాలా.. ఫ్రీ కోచింగ్‌తో ‘నీట్’ క్రాక్ చేసిన కుమార్తె!
Comments
Please login to add a commentAdd a comment