
సాక్షి, న్యూఢిల్లీ: చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మంగళవారం బీజేపీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్ నుంచి సభ్యత్వ రశీదును తీసుకుని పార్టీ కండువాను కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ..అధికారం ఉందనే అహకారంతో కేసీఆర్ తనపై 38 కేసులు పెట్టినా, ఏమి సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. త్వరలోనే మైహోం సిమెంట్‌తోనే కేసీఆర్‌కు రాజకీయ సమాధి కడతానని ఆయన హెచ్చరించారు.
తీన్మార్ మల్లన్న పార్టీలో చేరడం సంతోషంగా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ..దేశంలో ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు మోదీ నాయకత్వంతో పాటూ, మల్లన్న లాంటి వ్యక్తుల అవసరం చాలా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment