
కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ..
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. బెంగాల్ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను వెనక్కి రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేస్తున్నాయన్నారు. పూర్తి వివరాలు..
చంద్రబాబు రూటు మార్పు అందుకోసమే: సుచరిత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నక్క జిత్తులను ప్రయోగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలన్నది ఆయన ప్లాన్ అని మండిపడ్డారు. పూర్తి వివరాలు..
రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా..
రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత పది నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆస్తులను కాపాడేందుకు ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. అయితే గతంలో బ్రిటిష్, నిజాం కాలం నుంచి ఆస్తులకు భద్రత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పూర్తి వివరాలు..
నింగికెగిసిన పీఎస్‌ఎల్వీ సీ-50 రాకెట్
శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. పూర్తి వివరాలు..
దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్
మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉందని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. వేదిక మీదకు చేరుకొని జ్యోతిరావ్ పూలే, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పూర్తి వివరాలు..
ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్
ఆంధ్రప్రదేశ్‌లో మరో జపాన్ ఇండ్రస్టియల్ టౌన్‌షిప్‌కు శ్రీకారం చుడుతున్నట్లు పరిశ్రమలు, ఐటి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. డీపీఐఐటీ, సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన జపాన్ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రంతో జపాన్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏడాదిన్నర ప్రభుత్వంతో మరింత అనుబంధం ఏర్పడిందన్నారు. పూర్తి వివరాలు..
‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత వచ్చే ఏడాది జూలై 14న దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు..
‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలే..!’
పేదల మోముల్లో ఆనందపు వెలుగులు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో 180 డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఎఫ్‌డీసీ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి మంత్రి హరీష్ ప్రారంభించారు. పూర్తి వివరాలు..
భారత్ మాకు నిజమైన మిత్రదేశం...
భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో తమకు అండగా నిలిచిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో బంగ్లాదేశ్‌కు భారత్ పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1971లో ఇండో- పాక్ యుద్ధం మొదలైంది. పూర్తి వివరాలు..
అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నాసా
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతశ్రేణులు ఏవంటే వెంటనే గుర్తుకు వచ్చేవి హిమాలయాలు. ఎప్పడూ మంచుతో కప్పబడి ఉండే హిమాలయాకు సంబంధించి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ అరుదైన చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాలు..
జనవరి 1 నుంచి కొత్త రూల్స్..
చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 2021 జనవరి 21 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతుంది. అలాగే ఎల్‌పిజి సిలిండర్ ధరలు, జీఎస్‌టీ, యుపీఐ లావాదేవీల చెల్లింపు, వాట్సాప్ వంటి ఇలా సామాన్యుల జీవితాల్లో బాగా ప్రభావం చూపే చాలా నిబంధనలు జనవరి 1 నుంచి మారబోతున్నాయి. పూర్తి వివరాలు..
హైదరాబాద్‌లో ‘ఎఫ్ 3’ పూజ కార్యక్రమం
వెంకటేష్ , వరుణ్ తేజ్‌లు హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో గతేడాది వచ్చిన ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్‌లు నటించారు. కామెడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభ పూజ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాలు..
కోహ్లి రనౌట్; టీమిండియా టపాటపా
హమ్మయ్య.. మరో వికెట్ పడకుండా టీమిండియా కాచుకుంది. ఆరు వికెట్ల నష్టంతో తొలిరోజు ఆటను ముగించింది. జోరు మీదున్న ఆస్ట్రేలియా బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మన్లను వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టించడంతో ఒక దశలో ఆందోళన రేగింది. వృద్ధిమాన్ సాహా(9), రవిచంద్రన్ అశ్విన్(15) నాటౌట్‌గా నిలిచి తొలిరోజు ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డారు. పూర్తి వివరాలు..
దివీస్ ల్యాబ్ వద్ద ఆందోళన..
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల దివీస్ ల్యాబరేటరీస్ వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ల్యాబరేటరీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, వామపక్షలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. పూర్తి వివరాలు..