►‘మిషన్–ముంబై’ ఘరూ
జనవరి చివర లేదా ఫిబ్రవరిలో మొదటి వారంలో జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ‘మిషన్–ముంబై’ పేరుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నా యి. పూర్తి వివరాలు..
►చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని మానసిక రోగిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అభివర్ణించారు. ఉన్మాది, ఉగ్రవాదిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ పత్రికలతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..
►‘నిమ్మగడ్డ.. చంద్రబాబు తొత్తు’
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయం ప్రజలను విస్మయానికి గురిచేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.రాష్ట్రంలోని పరిస్థితులను ఎస్‌ఈసీకి అధికారులు వివరించినా పట్టించుకోలేదని.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలు..
►ధాన్యం కొనకుంటే కేసీఆర్ దుకాణం బంద్
మోదీకి మొగుడిని అవుతానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. కేసీఆర్ శిఖండిగా మారాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేసీఆర్ మోదీ కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు. పూర్తి వివరాలు..
►ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు.. సోమవారం విచారించనుంది. పూర్తి వివరాలు..
►మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీచేసిన నిమ్మగడ్డ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. పూర్తి వివరాలు..
►గొల్ల, కురుమలకు కేసీఆర్ గుడ్ న్యూస్..
గొల్ల, కురుమలకు సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) రెండో విడత గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పూర్తి వివరాలు..
►గుడ్ న్యూస్ : ఈ నెల16 నుంచే వ్యాక్సినేషన్
దేశ ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుకను అందించింది. 2021 జనవరి 16న టీకా డ్రైవ్ ప్రారంభమవుతుందని శనివారం అధికారికంగా వెల్లడించింది.ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఫ్రంట్‌లైన్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. పూర్తి వివరాలు..
►ఇండోనేషియా విమానం అదృశ్యం..
ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్ వెళ్తున్న ఎస్‌జే 182 శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. పూర్తి వివరాలు..
►డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?
డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభాల్లో అదరగొట్టింది. వార్షికంగా తన లాభాలను 16 శాతం మేర పెంచుకుంది. 2020 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 11 శాతం పెరిగిందని శనివారం విడుదల చేసిన ఫలితాల్లో వె ల్లడించింది. పూర్తి వివరాలు..
►‘క్రాక్’ వాయిదా.. మధుపై రవితేజ సీరియస్!
‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’. చాలా రోజుల తర్వాత థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చుద్దామనుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్‌కు శనివారం నిరాశ ఎదురైంది. పూర్తి వివరాలు..
►సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది డ్రింక్స్ సపోర్టర్స్ సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదాస్పందంగా మారింది. పూర్తి వివరాలు...
►కల్తీ కల్లు కలకలం, 100 మందికిపైగా అస్వస్థత
వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపింది. కృత్రిమ కల్లు తాగి రెండు గ్రామాల్లో దాదాపు 100కి మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment