►'బీజేపీ జై శ్రీరాం కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి'
రామతీర్థం ఘటనపై టీడీపీ, బీజేపీ నాయకులు రాజకీయ క్రీడ ఆడుతున్నారని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ తరపున మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని రాజకీయ పార్టీలు చెప్పడం రాజకీయ కుట్రే. పూర్తి వివరాలు..
►‘టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం’
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ.. తమకు నీతులు చెప్పుతారా అంటూ నిప్పులు చెరిగారు. పూర్తి వివరాలు..
►ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ
గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 గుడులను పునఃనిర్మించే పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు..
►నిమ్మగడ్డతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్‌తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎస్ బృందం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. పూర్తి వివరాలు..
►అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు..
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్‌పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలు..
►ముఖ్యమంత్రికి బెదిరింపు లేఖ
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు హత్య బెదిరింపు లేఖ చేరింది. ఆయన నివాస కార్యాలయానికి(నవీన్ నివాస్) గురువారం వచ్చిన ఈ లేఖలో హత్యకు వ్యూహరచన పూర్తి అయినట్లు పేర్కొన్నారు. కిరాయి హంతకులు సిద్ధం అయ్యారని.. అత్యాధునిక అస్త్రాలతో హత్యల్లో ఆరితేరిన వర్గం నగరంలో నవీన్ ప్రతి అడుగులో అడుగు వేస్తుందని ప్రధానాంశం. పూర్తి వివరాలు..
►మూల్యం చెల్లించక తప్పదు: ట్రంప్
అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై జరిగిన దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హింసకు పాల్పడే వారు అసలు ఈ దేశ ప్రజలే కాదు అంటూ మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పూర్తి వివరాలు..
►కోవిడ్ భయం: విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు
కరోనా మన జీవితాల్లో భారీ మార్పులే తెచ్చింది. వేడుకలు, సరదాలు, పండగలు, పబ్బాలు ఏవి లేవు. మూతికి మాస్క్, చేతిలో శానిటైజర్ తప్పనిసరి అయ్యాయి. ఇక బస్సు, రైలు, విమాన ప్రయాణాలు అంటేనే జనాలు దడుచుకునే పరిస్థితులు తలెత్తాయి. అందుకే నలుగురితో కలవాలన్న.. కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ కోవకు చెందిన వాడే ఇప్పుడు మనం చేప్పుకోబేయే వ్యక్తి. పూర్తి వివరాలు..
►రికార్డుల మోత, టెక్ మహీంద్ర ఘనత
వరుస రెండురోజుల నష్టాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం తిరిగి జోష్‌లోకి వచ్చాయి. చివరిదాకా అదే రేంజ్‌ను కొనసాగించాయి. భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే మరో ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేశాయి. ఐటీ, ఆటో, ఫార్మా స్టాక్స్‌కు కొనుగోళ్ళ మద్దతుతో కీలక సూచీలు రికార్డుల మోత మోగించాయి. పూర్తి వివరాలు..
►సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
లాక్‌డౌన్ కాలంలో పెళ్లి బాట పడుతున్న నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్ రానా దగ్గుబాటి, నితిన్‌లు, నిహారి కొణిదెల వంటి కొంతమంది స్టార్‌లు ఇటీవల ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. తాజాగా ‘బస్‌స్టాప్’ ఫేం కయల్ ఆనంది కూడా పెళ్లి పీటలు ఎక్కారు.. పూర్తి వివరాలు..
►నాగిన్ డ్యాన్స్‌తో అదరగొట్టిన క్రికెటర్
షేక్ జాయేద్ స్టేడియం వేదికగా శుక్రవారం ఐర్లాండ్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వికెట్ తీసిన ఆనందంలో యూఏఈ క్రికెటర్ రోహన్ ముస్తఫా నాగిన్ డ్యాన్స్‌తో అలరించాడు. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment