టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 10th January 2021 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Published Sun, Jan 10 2021 5:39 PM | Last Updated on Sun, Jan 10 2021 5:58 PM

Today Top News 10th January 2021 - Sakshi

కీలక నిర్ణయం: బీజేపీ బాటలో మమత..
దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకిస్తున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో మూడు నాలుగు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విజయమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. పూర్తి వివరాలు..

అమ్మ ఒడి ఆగదు: మంత్రి సురేష్‌
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుది దివాళాకోరు రాజకీయమని ధ్వజమెత్తారు.. పూర్తి వివరాలు..

చంద్రబాబు డైరెక్షన్‌లో నిమ్మగడ్డ..
స్థానిక ఎన్నికలను నిర్వహించడమనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యతిరేకిస్తున్నామన్నారు. పూర్తి వివరాలు..

'కూకట్‌పల్లిలో బండి సంజయ్‌కు వ్యాక్సిన్‌ వేశా'
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖమ్మం పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధీటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ మంత్రి పదవి ఆశించలేదు. ఎన్నికల సమయం కావడంతో కొందరు టూరిస్ట్‌లు వస్తుంటారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చింది. పూర్తి వివరాలు..

ఏపీ: కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు
ఆంధప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది. కోవిడ్ వ్యాక్సిన్ రవాణా, భద్రపరచడంపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు..

ఎస్ఈసీ నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానాలు
రాజ్యాంగ పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ టీడీపీ నేతలా మారిపోయారు. ఆదివారం పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు టీడీపీ నేతలు సాదర స్వాగతం పలకడమే కాకుండా, స్వయంగా సన్మానాలు కూడా చేశారు. పూర్తి వివరాలు..

యూఎస్‌: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన సమయంలో ప్రవాస భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విన్సెంట్‌ జావియర్‌ పాలతింగాల్‌ (54) ట్రంప్‌ మద్దతుదారులతో కలిసి మన జాతీయ జెండాని ప్రదర్శించాల్సిన అవసరమేమొచ్చిందని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలు..

రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్‌కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. గత వారమే 30 వేల డాలర్లను దాటిన బిట్‌కాయిన్ ఈ వారం ముగిసే సరికి 40 వేల డాలర్లను తాకింది. 2021లో మొదటి మూడు రోజుల్లోనే దీని విలువ 5 వేల డాలర్లు పెరిగింది. పూర్తి వివరాలు..

చైతూ, సాయి పల్లవి ‘లవ్ ‌స్టోరీ’ టీజర్‌ రిలీజ్‌
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లవ్‌ స్టోరీ’. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పూర్తి వివరాలు...

కెప్టెన్‌తో గొడవ.. టీమ్‌ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్‌
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముందే బరోడా టీమ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆదివారం నుంచి టోర్నీ ప్రారంభం అవుతుండగా జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. పూర్తి వివరాలు..

జల్లికట్టులో విషాదం.. ఇద్దరు మృతి
జల్లికట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నేర్లగిరిలో ఆదివారం ఉదయం నుంచి జోరుగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement