టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 17th January 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Published Sun, Jan 17 2021 6:39 PM | Last Updated on Sun, Jan 17 2021 7:52 PM

Today Top News 17th January 2020 - Sakshi

రాష్ట్ర వాటా చెల్లిస్తేనే రెండో దశ పనులు 
నగర ప్రజా రవాణాలో ఎంతో కీలకంగా మారినందున ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు వే గంగా పూర్తయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కోరారు. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవటంతో పనులు నిలిచిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు. పూర్తి వివరాలు..

నాని సినిమా తరహా ఘటన.. కబడ్డీ కూతకు వెళ్లి..
జిల్లాలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్‌ అయిన తర్వాత తిరిగొస్తూ గుండెపోటు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే మృతి చెందాడు. వల్లూరు మండలంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు..

ఢిల్లీలో 52 మందిలో వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్‌ తీసుకున్న 52 మందిలో దుష్ప్రభావాలు బయటపడటం కలకలం రేపుతోంది. కోవాగ్జిన్‌ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ వేసుకున్న కొందరిలో వ్యాక్సిన్‌ వేసుకున్న15-20 నిమిషాల తర్వాత గుండె దడ, అలర్జీ, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు తలెత్తినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు. పూర్తి వివరాలు..

100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా
 అగ్రరాజ్యం అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కొత్త లక్ష్యాలను ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి 100 రోజుల్లో దేశంలోని 100 మిలియన్ల (10కోట్ల) మందికి టీకా అందజేస్తుందని ప్రకటించారు. కోవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్న తమ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు..

రోజుకు రూ.9 లక్షలు, ఐఫోన్లు, లగ్జరీ కారు.. ఇంతలో
మద్యంపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ బిహార్‌లో మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కంట పడకుండా గుట్టుచప్పుడుగా మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అయితే ఏకంగా రోజుకు 9 లక్షల విలువ చేసే మద్యాన్ని విక్రయిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు..



దుబాయ్‌కి వెళ్తున్న మహేశ్‌.. 20 రోజలు అక్కడే!
దుబాయ్‌ వెళ్లడానికి రెడీ అవుతున్నారు మహేశ్‌బాబు. ఫ్యామిలీతో అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్‌ వెళ్తారు కదా.. ఈ ప్రయాణం అది కాదు. ‘సర్కారువారి పాట’ షూటింగ్‌ కోసమే దుబాయ్‌ వెళ్తున్నారట. పరుశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఈ నెకాఖరున దుబాయ్‌లో ఆరంబించాలనుకుంటున్నారని తెలిసింది. పూర్తి వివరాలు..

హార్దిక్‌ తండ్రి మృతి: నువ్‌ నా హీరో డాడీ!
తండ్రి మరణం పట్ల టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. ఆయన లేని లోటు జీవితంలో పూడ్చలేనిదని పేర్కొన్నాడు. జీవితంలో తన తండ్రి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం అత్యంత కఠినమైనదని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటోతోపాటు భావోద్వేగ పోస్టు చేశాడు. ‘నాన్నా.. నువ్‌ నా హీరో. నువ్‌ ఇక లేవు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. పూర్తి వివరాలు..

జీయో యూజర్లకు బ్యాడ్ న్యూస్
రిలయన్స్ జియో రూ.99, రూ.153, రూ.297, రూ.594 గల జియోఫోన్ ప్లాన్‌ ధరలను తొలగించింది. కేవలం ఈ ఆఫర్ జియోఫోన్ 4జీ ఫీచర్ ఫోన్‌లు వినియోగిస్తున్న యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని గతంలో పేర్కొంది. అయితే మిగతా ప్లాన్ విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదని సంస్థ పేర్కొంది. పూర్తి వివరాలు..

నాన్నకి కారం అంటే ఇష్టం
రంగావఝల రంగారావు... ఈ పేరు ఎవ్వరికీ తెలియదు... సాక్షి రంగారావు... అందరికీ పరిచితులే...సినిమాలలో విలన్‌ పాత్రలు... జీవితంలో సౌమ్యతత్త్వం.. సినిమాలలో కరణీకం... జీవితంలో అప్పులంటే భయం.. బాపు సాక్షితో వెండితెరకు పరిచితులై సాక్షి రంగారావుగా మారారు. తనకు తానే పేరు పెట్టుకున్న, వారి కుమారుడు సాక్షి శివతో ఈ వారం సినీ పరివారం... పూర్తి వివరాలు..

‘విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర’
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరసరావుపేటలో గోపూజ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా జరగడం సంతోషంగా ఉందన్నారు. పూర్తి వివరాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement