
బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: అమిత్ షా
పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు. అమిత్ షా ఆదివారం బోల్పూర్‌లో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. పూర్తి వివరాలు..
ఉనికి కోసమే టీడీపీ దుష్ప్రచారం..
మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు
నడి రోడ్డు మీద బీజేపీ నేతల కుమ్ములాట
సికింద్రాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరాయి. నడి రోడ్డు మీదే బీజేపీ నేతలు ఘర్షనకు దిగారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్ దాడి చేశారు. దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ హంగామా చేశారు. పూర్తి వివరాలు..
బీజేపీకి షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా
మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పేరిట ఒక నోట్ విడుదలైంది. అనివార్య కారణాల వల్ల తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు శేఖర్ అందులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు..
పోలవరం పనులపై పీపీఏ సీఈవో సంతృప్తి
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పీపీఏ కమిటీ సీఈవో పనులను పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు..
ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్ చేసి, వెద సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు..
గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. నేడు సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్‌బహదూర్’ వర్ధంతి కావడంతో ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. పూర్తి వివరాలు..
9 ఏళ్లకే మిలియన్ డాలర్ల సంపాదన
తొమ్మిదేళ్ల వయసులో మనందరం ఏం చేస్తాం.. మహా అయితే స్కూల్‌కి వెళ్లడం.. ఇంటికి వచ్చాక స్నేహితులతో ఆడుకోవడం చేస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన 9 ఏళ్ల ర్యాన్ కాజీ మాత్రం చిన్న వయసులోనే మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్యర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. పూర్తి వివరాలు..
పబ్జి ప్రియులకు ఇది చేదు వార్తే..
భారత్ లో పబ్జి గేమ్ ఇప్పట్లో లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్నవివాదం నేపథ్యంలో దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనా యాప్‌లను నిషేదించింది. ఈ నిషేధిత జాబితాలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన పబ్జి గేమ్ కూడా ఉంది. పూర్తి వివరాలు..
ఫన్ ఫ్యామిలీ, నైటౌట్.. మహేశ్ ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి, మహేశ్ బాబు మధ్య స్నేహబంధం మరింత బలపడింది. పూర్తి వివరాలు..
కోహ్లిని ముంచిన పింక్ బాల్ టెస్ట్..
ఐసీసీ ఆదివారం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 901 పాయింట్లతో టాప్ స్థానం నిలుపుకోగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 888 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉన్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఘోర ప్రదర్శన నమోదు చేసింది. పూర్తి వివరాలు..
మిస్టరీగా మహిళ మిస్సింగ్..
దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అదృశ్యంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ ఫిర్యాదుతో గన్నవరంలో పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పూర్తి వివరాలు..