కోల్‌కత్తా: డిజిటల్ ఇండియాకు మద్దుతునిచ్చేందుకు ఈ నూతన వధువరులు భిన్నంగా ఆలోచించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ జంట వివాహ విందు మెనును చూసి పెళ్లికి వచ్చిన బంధువలతో పాటు నెటిజన్‌లు కూడా అవాక్కవుతున్నారు. అచ్చం ఆధార్ కార్డును పోలిన ఈ వెడ్డింగ్ మెను కార్డును మొదట ఫేస్‌బుక్ షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అచ్చం ఆధార్ కార్డును పోలీన ఈ కార్డులో పెళ్లి భోజనాల జాబితా ఉండటంతో ఇక అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం ఈ కార్డు చక్కర్లు కొడుతోంది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వరుడు గోగోల్ షాహా, వధువు సుబర్ణ దాస్‌ల వివాహం ఫిబ్రవరిలో 1వ తేదీన(సోమవారం) జరిగింది. అయితే వీరి పెళ్లికి వచ్చిన అతిథుల కో సం విందు అంధించేందుకు ఈ జంట కాస్తా భిన్నంగా ఆలోచించింది. (చదవండి: గొంతులో ఇరుక్కున్న 14 సెం.మీ. కత్తి)
అందుకే వారి పెళ్లి పత్రికను అచ్చం ఆధార్ కార్డుల తయారు చేయించి వివాహ భోజనాల జాబితాను ఉంచారు. దీనిపై నూతన వరుడు గోగోల్ స్పందిస్తూ.. ‘ఇది నా భార్య సుబర్ణ దాస్ ఆలోచన. డిజిటల్ ఇండియాకు మేము మద్దుతుగా నిలవాలనుకున్నాం. అయితే మాకు ఇంతకంటే ఉత్తమమైన మార్గం కనిపిచలేదు. అందుకే మా వెడ్డింగ్ మెను కార్డును ఆధార్ కార్డులా తయారు చేయించి డిజిటల్ ఇండియా మద్దతునిచ్చాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వారి పెళ్లి ఆధార్ కార్డు మెనును చూసి బంధువులంతా షాకవుతున్నారు. ‘ప్రస్తుత కాలంలో పెళ్లికి రావాలంటే కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది’ అంటూ ‘మా ఆధార్ కార్డును డైనింగ్ టెబుల్ దగ్గర మర్చిపోయాం’ అంటూ బంధువులంతా చమత్కరించారని చెప్పాడు. (చదవండి: వైరల్: ఫ్రెండ్‌తో కాఫీ షాపులో సారా టెండూల్కర్)
Comments
Please login to add a commentAdd a comment