న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్యలో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదవుతోంది. మంగళవారం నాటికి దేశంలో మొత్తంగా కరోనా కేసులు 22,68,675 చేరగా.. ఇప్పటి వరకు 45,257 మంది కోవిడ్ బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా అత్యంత ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే ఒక రోజులో నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.(అమెరికా, బ్రెజిల్ కంటే వేగంగా!)
వారం రోజులుగా రికార్డు స్థాయిలో
గత వారం రోజులుగా(ఆగష్టు 4-10) ఇండియాలో రికార్డు స్థాయిలో 4,11,379 మంది కరోనా బారిన పడగా.. 6,251 మంది మహమ్మారి కారణంగా మరణించారు. అదే సమయంలో అమెరికాలో 3,69,575 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,232 కరోనా మరణాలు సంభవించాయి. ఇక బ్రెజిల్ విషయానికి వస్తే.. 3,04,535 మందికి వైరస్ సోకగా.. 6,914 మంది కోవిడ్‌తో మృతి చెందారు. అయితే గత నాలుగు రోజులుగా దేశంలో వరుసగా 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు 70 శాతంగా ఉండటం భారత్‌కు సానుకూలాంశమని చెప్పవచ్చు.(10 రాష్ట్రాల్లో కట్టడి అవసరం: మోదీ).
మరణాల రేటు తక్కువే.. అయితే
ఈ రెండు దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగానే ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 16 లక్షలకు చేరువైనట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. మరణాల రేటు 1.99 శాతానికి పడిపోయిందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మరో విషయాన్ని గమనించాల్సి ఉంది. అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే కరోనా టెస్టుల విషయంలో మాత్రం భారత్ వెనుకబడే ఉందని వరల్డోమీటర్ గణాంకాలు తెలుపుతున్నాయి. యూఎస్‌లో 1 మిలియన్ జనాభాకు 1,99,803 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. బ్రెజిల్‌లో ఈ సంఖ్య 62,200గా ఉంది. భారత్‌లో మాత్రం ప్రతీ పది లక్షల మంది జనాభాకు కేవలం 18, 300 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆగష్టు 10న భారత్‌లో 62, 064 కేసులు నమోదు కాగా అమెరికాలో 53, 893 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇదే రోజున బ్రెజిల్‌లో 49, 970కి కరోనా సోకింది.
ఆగష్టు 4న పాజిటివ్ కేసుల సంఖ్య
- భారత్- 52,050
- అమెరికా- 47,183
- బ్రెజిల్- 25,800
ఆగష్టు 5
- భారత్- 52,509
- అమెరికా- 49,151
- బ్రెజిల్-16,641
ఆగష్టు 6
- భారత్- 56,282
- అమెరికా- 49,629
- బ్రెజిల్-51,603
ఆగష్టు 7
- భారత్ 62,538
- అమెరికా- 53,373
- బ్రెజిల్-57,152
ఆగష్టు 8
- భారత్- 61,537
- అమెరికా- 55,318
- బ్రెజిల్- 53,139
ఆగష్టు9
- భారత్- 64,399
- అమెరికా-61,028
- బ్రెజిల్- 50,230
Comments
Please login to add a commentAdd a comment