చేపల కోసం వల వేస్తే శవం పడింది! | woman body found in sack pond murder case nagercoil | Sakshi
Sakshi News home page

చేపల కోసం వల వేస్తే శవం పడింది!

Feb 14 2026 10:53 AM | Updated on Feb 14 2026 10:53 AM

woman body found in sack pond murder case nagercoil

 అన్నానగర్‌: చేపలు పట్టేందుకు వల వస్తే..ఊహించని విధంగా ఓ శవం అందులో వచ్చింది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటనను ఇది వెలుగులోకి తెచ్చింది. వివరాలు..నాగర్‌కోయిల్‌ సుంగాన్‌ కడైలోని అంబేడ్కర్‌ కాలనీ ప్రాంతంలో పణంగుళం అనే కొలను ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకులు  కొలనులో  చేపలు పడుతుండగా, వారి వలలో ఒక పెద్ద సంచి చిక్కుకుంది. దానిని యువకులు శ్రమలకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సంచి నుంచి దుర్గంధం వస్తూండడంతో అనుమానించారు. సమాచారం ఇవ్వడంతో ఇరానియల్‌ పోలీస్‌ స్టేషన్‌  పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  సంచిని తెరిస్తే...దారుణ హత్యకు గురై, కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బయటపడింది. 

ఆ యువతి మృతదేహాన్ని  తీగలతో కట్టివేసి, పెద్ద రాయి కట్టి కొలనులో పడేసినట్లు తేలింది.  హత్య చేశాక నిప్పంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ల వయసున్న ఆమె మృతదేహం ఉన్న స్థితి బట్టి వారం క్రితం ఆమె హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్న ప్రాంతంలో చాలా కాలేజీలు ఉన్నాయి. హత్యకు గురైన యువతి కాలేజీ విద్యార్థునా? ఎవరైనా విద్యార్థుని అదృశ్యమయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement