న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల పునరుద్ధరణకు వివిధ రకాలైన ప్రపంచ సంక్షోభాలు పెనుముప్పుగా మారాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘వరల్డ్ ఆఫ్ వర్క్ ’’ అనే అంశంపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ప్రపంచ దేశాల్లో పని గంటలు కరోనా సంక్షోభానికి ముందుతో (2019 నాలుగో క్వార్టర్) పోల్చి చూస్తే 3.8శాతం తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే 11.2 కోట్ల మధ్య ఉద్యోగాలు కోల్పోయి ఉండవచ్చునని అంచనా వేసింది.
పని గంటల్లో జెండర్ గ్యాప్
పని గంటల్లో స్త్రీ, పురుష అంతరాలు బాగా పెరిగిపోతున్నాయని అభివృద్ధి చెందిన దేశాల కంటే అల్పాదాయ దేశాల్లో ఈ అంతరాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎల్‌ఒ నివేదిక వెల్లడించింది. భారత్‌లో మహిళలు చేసే పనిగంటలు బాగా తగ్గిపోయాయని పేర్కొంది. కరోనా సంక్షోభానికి ముందు పని చేసే ప్రతి 100 మంది మహిళల్లో సగటున 12.3 మంది మహిళలు కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. అదే విధంగా ప్రతీ 100 మంది పురుషుల్లో 7.5 మందికి ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. దీనిని బట్టే భారత్‌లో స్త్రీ, పురుష అంతరాలు ఎంతలా ఉన్నాయో తెలుస్తోందని ఆ అధికారి వివరించారు.
ధనిక దేశాల్లో గతంతో పోల్చి చూస్తే పని గంటలు పెరిగితే అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో తగ్గిపోతున్నాయంటూ ఐఎల్‌ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో స్త్రీ, పురుషుల మద్య అంతరాలు తొలగిపోవడానికి మరో 30 ఏళ్లు పడుతుందని ఐఎల్‌ఒ తెలిపింది. ఇక భారత్‌లో మహిళలకు గౌరవప్రదమైన ఉద్యోగాలు, సరైన జీతాలు లేకపోవడంతో ఈ అంతరాలు పెరిగిపోతున్నాయని దేశంలోని ట్రేడ్ యూనియన్లు విశ్లేషించాయి. ఉద్యోగాల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మహిళలకు సామాజిక భద్రత లేకపోవడం వల్ల కూడా ఈ అంతరాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నాయి.
పని గంటలు తగ్గిపోవడానికి కారణాలివే..!
పని గంటలు తగ్గిపోవడానికి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎన్నో కారణాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం, ముఖ్య ంగా చమురు, ఆహార ధాన్యాల ధరల పెరుగు దల, ఆర్థికసంక్షోభాలు, రుణ భారం, అంతర్జా తీయ సప్లయ్ చైన్‌లో అవరోధాలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ప్రభావం వంటివెన్నో పని గంటల్లో తగ్గించేశాయని ఐఎల్‌ఓ నివేదిక స్పష్టం చేసింది. చైనాలో ఈ ఏడాది కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌ల కారణంగానే 86% పని గంటల్లో ప్రభావం కనిపించిందని ఆ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment