ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
● 122మంది విద్యార్థుల గైర్హాజరు
నిర్మల్ రూరల్: జిల్లాలోని సంక్షేమ గురుకుల పా ఠశాలల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అ ర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ దయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వర కు పరీక్షలు నిర్వహించారు. గంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. పరీ క్ష నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 6,034 మంది విద్యార్థులకు గా ను 5,912 మంది హాజరు కాగా, 122 మంది హా జరు కాలేదు. ఐదో తరగతిలో ప్రవేశానికి 4,276 మంది విద్యార్థులకు గాను 4,210 మంది హాజ రు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. ఆరో తరగతిలో 727 మందికి గాను 706 మంది హాజరు కాగా, 21 మంది పరీక్ష రాయలేదు. ఏడో తరగతిలో 418 మందికి గాను 399 మంది హాజరు కాగా, 19 మంది గైర్హాజరయ్యారు. ఎనిమిదో తరగతిలో 326 మందికి గాను 316 మంది హాజరు కాగా, 10 మంది హాజరు కాలేదు. తొమ్మిదో తరగతిలో 287 మందికి గాను 281 మంది హాజరు కాగా, ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment