గజ్జలమ్మకు ప్రత్యేక పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వచ్చారు. అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, సినీగేయ రచయిత తాటి శివ ఆధ్వర్యంలో పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment