బాలల హక్కులు కాపాడదాం
● ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో 66 మంది బాల కార్మికులకు విముక్తి ● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో భాగంగా 66 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సోమవారం ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 66 మంది బాల కార్మికులను గు ర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని తెలిపా రు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం అయిందన్నారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతానికి జిల్లాలో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, రాజేశ్‌మీనా, సీడీపీవో నాగలక్ష్మి, సీడబ్ల్యూసీ చైర్మన్ వహీద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజలింగు, డీసీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment