శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలి
తానూరు: ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే రామారావ్‌పటేల్ సూచించారు. కళ్యాణి గ్రామంలో మంగళవారం నిర్వహించిన శివాజీమహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ శివాజీ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్, శివాజీ పటేల్, చక్రధర్ పటేల్, చిన్నారెడ్డి, సోమ్‌నాథ్, బాలాజీ ఆయా గ్రామాల కార్యకర్తలు, శివాజీ యుత్ సభ్యులు పాల్గొన్నారు.
శివాజీమహ రాజ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment