అప్పుల బాధతో ఒకరు..
దస్తురాబాద్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శంకర్ కథనం ప్రకారం.. మండలంలోని గోడిసీర్యాల గోండుగూడ గ్రామానికి చెందిన నామెల్లిపురుక జగన్(45), రాధ దంపతులు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. ఆయనకున్న ఎకరం భూమిలో పంట సాగు చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం జగన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పలువురి వద్ద చేసిన అప్పులు చేసి మద్యం తాగేవాడు. అప్పలు తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం ఇంట్లో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఆ సమయంలో భార్య రాధ పక్కింట్లోకి వెళ్లి తిరిగివచ్చింది. అప్పటికే పురుగుల మందు తాగిన జగన్ భార్యతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నోట్లో నుంచి నురుగులు కక్కడంతో 108 సిబ్బందికి సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గమనించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment