పెళ్లిబరాత్‌లో గొడవ..
● యువకుడి కణతలో కత్తిపోటు
నిర్మల్‌రూరల్: పెళ్లిబరాత్‌లో డ్యాన్స్ చేస్తుండగా జరిగిన గొడవ కత్తిపోటుకు దారితీసింది. ఈ ఘటన నిర్మల్‌రూరల్ మండలం రత్నాపూర్ కాలనీ తండాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఏఎస్పీ రాజేశ్‌మీనా సోమవారం రాత్రి వివరాలు వెల్లడించారు. మండలంలోని రత్నాపూర్ కాలనీ తండాలో ఆదివారం ఓ పెళ్లి జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బరాత్ జరుగుతుండగా, గ్రామానికి చెందిన మలావత్ రాజు, పక్క గ్రామం రత్నాపూర్‌కాండ్లీ నుంచి సులిగెల శ్రీకర్‌కూడా బరాత్‌కు వచ్చాడు. రాజు, శ్రీకర్ కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో మద్యం తాగి ఉన్న రాజు డ్యాన్స్ చేస్తూ శ్రీకర్‌పై పడ్డాడు. దీంతో ‘మద్యం తాగి ఎందుకు డాన్స్ చేస్తున్నావ్....? ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని గట్టిగా అరిచాడు. దీనిని అవమానంగా భావించిన రాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు. బరాత్ పూర్తి అయిన తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శ్రీకర్ తన స్నేహితులు కలిసి మోటార్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. మలావత్ రాజు అడ్డుకున్నాడు. జేబులో ఉన్న కత్తితో కణత భాగంలో పొడిచాడు. ఈ ఘటనలో శ్రీకర్ కన్ను, కుడిచెవి మధ్యభాగంలో ఇరుక్కుపోయింది. అతని స్నేహితులు వెంటనే బైక్‌పై జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజును సోమవారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్సై లింబాద్రి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment