కరీంనగర్ తరలిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
నిర్మల్‌ఖిల్లా: కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్మల్ జిల్లాలో హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ రోజునే ఉపాధ్యాయుల నిర్ణయం నిక్షిప్తమై ఉండగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆయా అభ్యర్థుల మద్దతుదారులు పలువురు కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. మరికొందరు టీవీల్లో అప్‌డేట్ తెలుసుకుంటున్నారు. బీజేపీ మద్దతుతో మల్క కొమరయ్య బరిలో ఉండగా, తపస్ మద్దతు ప్రకటించింది. మరోవైపు ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ తరఫున బరిలో ఉన్న వంగా మహేందర్‌రెడ్డి సైతం గట్టి పోటీ ఇచ్చారు. జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు యాటకారి సాయన్న వీఆర్‌ఎస్ ప్రకటించి బీఎస్పీ మద్దతుతో పోటీలో నిలిచారు. జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు కరీంనగర్‌లోని కౌటింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో అప్‌డేట్ సమాచారం చేరవేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment