బాలాజీకి డాక్టరేట్
భైంసారూరల్: మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన కవి, రచయిత రెడ్ల బాలాజీకి ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దూడపాక శ్రీధర్ డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాద్, రవీంద్ర భారతిలో శ్రీఆర్యాణి సకల కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఉగాది పురస్కారం, జాతీయ విశ్వశాంతి పురస్కారం, బంగారు పతాకం వంటి పురస్కారాలతోపాటు, డేస్‌ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ తరఫున బాలాజీకి ప్రతిష్టాత్మక పురస్కారాలు, డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రియులు బాలాజీనిఅభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment