8, 9 తరగతుల బాలికలకు
నిర్మల్ రూరల్: బేటీ బచావో – బేటీ పడావో దశాబ్ది వేడుకల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతుల బాలికలకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రామారా వు తెలిపారు. ఈనెల 4న పాఠశాలస్థాయిలో పోటీలు నిర్వహించి, ప్రథమ, ద్వితీయ స్థానంలో గెలు పొందిన బాలికలు 5న మండల స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనాలని సూచించారు. మండ ల స్థాయిలో ప్రథమ, ద్వితీయస్థానాలు పొందిన బాలికలు 6న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గల గవర్నమెంట్ హైస్కూల్‌లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలన్నారు. విజేతలకు ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. వివరాలకు 9440069830 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment