నిర్మల్
అలరించిన వీడ్కోలు వేడుకలు
జిల్లాలోని పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు హంగామా చేశారు.
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
IIIలోu
‘మధ్యాహ్న’ కార్మికుల నిరసన
నిర్మల్‌చైన్‌గేట్: సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఏవో, డీఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మా ట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు గత డిసెంబర్ నుంచి పెరిగిన మెనూ చార్జీ రూ.74 పైసలు వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికు ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాధ, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు రాజేశ్వర్, మంజుల, పద్మ, గోదావరి, మాయవ్వ, సరస్వతి, లక్ష్మీబాయి, హంస పాల్గొన్నారు.
ప్రజలను వంచించే బడ్జెట్
ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌తో ప్రజలను మరింత మోసం చేసింది. బడ్జెట్ నిండా బడాయి, అప్పులు మినహా ప్రజాసంక్షేమం ఎక్కడా లేదు. జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. అభివృద్ధికి నిధులూ ఇవ్వలేదు.
– మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, నిర్మల్
బడ్జెట్‌లో ఏమీ లేదు
రాష్ట్రబడ్జెట్‌లో కోట్ల లో కేటాయింపులు మినహా.. చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లే దు. ప్రజలను వంచించే బడ్జెట్ ఇది. బాసర జ్ఞానసర్వసతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సంబంధించిన రూ.42కోట్ల నిధులు వెనక్కి ఇవ్వలేదు. చెరువులనూ పట్టించుకోలేదు. – రామారావుపటేల్,
ఎమ్మెల్యే, ముధోల్
ఆమోదయోగ్య బడ్జెట్
ప్రజల సంక్షేమం కోసం ఈసారి బడ్జెట్‌లో గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేపట్టాం. ఇది ప్రజామోదయోగ్యమైన పద్దు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది.
– వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే, ఖానాపూర్
ఈసారి కూడా రాష్ట్రబడ్జెట్ ఉసూరుమనిపించింది. రాష్ట్ర ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలు, రెగ్యులర్ కేటాయింపులు మినహా పెద్దగా ఎలాంటి ప్రత్యేకతలు కనిపించలేదు. యథావిధిగా ప్రాజెక్ట్‌లు, కాలువల మరమ్మతుకు ఎంతోకొంత ఇవ్వాలన్నట్లు ఈపద్దులో కేటాయింపులు మినహా పెద్దగా నిధులివ్వలేదు. బాసర ఆలయ అభివృద్ధికి కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో పాటు గతంలో తీసుకున్న రూ.42కోట్లపైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. బాసరలో గోదావరి హారతి చేపడతామని మాత్రం ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు ఇది ప్రజలను మోసగించే బడ్జెట్ అని, జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కల్పించలేదని ఆరోపణలు చేస్తుండగా, అధికారపక్షం మాత్రం ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని, గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశారని సమర్థిస్తున్నారు. – నిర్మల్
● పథకాలకే ప్రథమ ప్రాధాన్యత
● జిల్లాకు దక్కని ప్రయోజనం
● బాసర గోదావరికి ‘హారతి’
● మహిళలు, రైతులకు ఊరట
● బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
ఈసారి కూడా పాతలెక్కనే..
ఈసారి రాష్ట్ర పద్దులో పెద్దగా జిల్లాకు కేటాయింపులు లేవు. ఎప్పటిలాగే సాగునీటి ప్రాజెక్ట్‌ల మరమ్మ తు, నిర్వహణ కోసం అరకొరగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సారెస్పీ–1కింద పేర్కొ నే కడెం ప్రాజెక్ట్‌కు రూ.3కోట్ల లక్షాయాభైవేలు, సు ద్దవాగు ప్రాజెక్ట్‌కు రూ.3.42కోట్లు, స్వర్ణ ప్రాజెక్ట్‌కు రూ.70లక్షలు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపులున్నా.. అందులో జిల్లాలోని 27, 28 ప్యాకేజీలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే లెక్క తేల్చలేదు. ఏళ్లు గడిచిపోతున్నా.. పక్కనే ఉన్న గోదావరి జలాలు మాత్రం జిల్లాలోని భూములకు అందని పరిస్థితి ఉండగా పెద్దగా పట్టించుకోలేదు.
బాసరలో ‘హారతి’స్తారట..
జిల్లాలోనే కాదు.. దక్షిణ భారతంలోనే ప్రముఖ సరస్వతీక్షేత్రం బాసర. ఇక్కడి ఆలయ అభివృద్ధికి బడ్జె ట్‌లో నిధులు కేటాయించాలని దశాబ్దాలుగా డి మాండ్ చేస్తూ ఉంటే గత ప్రభుత్వం రూ.50కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.8కోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. ఇక ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిగతా రూ.42కోట్లు వెనక్కి తీసుకుంది. ఈ నిధులను తిరిగి ఆలయానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్ అసెంబ్లీ సాక్షిగా అడిగినా కేటాయించలేదు. ప్రభుత్వం తరఫున గంగాహారతి తరహాలో బాసరలో గోదావరికి హారతినిచ్చే కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు.
మహిళలు, రైతులకు..
మెగామాస్టర్‌ప్లాన్ 2050 పేరిట అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని ఆర్థికశాఖమంత్రి ప్రకటించారు. ప్రతీ మండలంలో మహిళలతో రైస్‌మిల్లులు, మినీగోదాములు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళల రైస్‌మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామన్నారు. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మ హిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామ ని ప్రకటించారు. మండల మహిళా సమాఖ్య ద్వా రా ఆర్టీసీకి 600 బస్సులు అద్దెకిస్తామని పేర్కొ న్నా రు. వీటిద్వారా జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులూ లబ్ధి పొందనున్నారు. రైతుభరోసాకు నిధుల కేటాయింపులతో పాటు సాగుకు రూ.24,439కోట్లు కేటాయించారు. విద్యారంగానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని, పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహం లేదని సంబంధిత రంగాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
న్యూస్‌రీల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్