కలెక్టరేట్ ఎదుట ఆశ కార్యకర్తల ధర్నా
నిర్మల్‌చైన్‌గేట్: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎ దుట ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఉద యం 9గంటలకే గేటు ఎదుట బైఠాయించి సుమా రు 3గంటలపాటు అధికారులు, ఉద్యోగులు, సి బ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పీఎఫ్, ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయిలు చెల్లించాలని డి మాండ్ చేశారు. డీఎంహెచ్‌వో, స్థానిక సీఐ పలు సార్లు సముదాయించినా వినలేదు. దీంతో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రోడ్డు పై, చెట్ల నీడన నిరీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వోతో మాట్లాడి పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు రిలీజ్ చేయించారు. మూడేళ్లకు సంబంధించిన సర్వే డబ్బులు గురువారం అందజేస్తామని హామీ ఇచ్చారు. మిగతా సమస్యలు కూడా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగామణి, సుజాత, చంద్రకళ, రామలక్ష్మి, విజయలక్ష్మి, మంగమ్మ, అనురాధ, శారద, లావణ్య, స్రవంతి, సౌమ్య, సరిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
అదనపు కలెక్టర్ హామీతో విరమణ
Comments
Please login to add a commentAdd a comment