‘పది’ విద్యార్థులతో కలెక్టర్ జూమ్ మీటింగ్
నిర్మల్‌చైన్‌గేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ముందు రోజు కలెక్టర్ అభిలాషఅభినవ్ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల విద్యార్థులతో జూమ్‌కాల్ మాట్లాడారు. ప్రశాంతంగా, ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలంటే భయం వీడి మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. పరీ క్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవా లని తెలిపారు. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. పరీక్ష కేంద్రంలోనికి పెన్నులు, పెన్సిల్, పరీక్ష ప్యాడ్ మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. సెల్ ఫోన్‌సహా. ఎలక్టాన్రిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, దిగ్విజయంగా పరీక్షలు రాయాలని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏర్పాట్లపై సమీక్ష..
అంతకు ముందు పరీక్షల నిర్వహణ, ఏర్పాట్ల పై విద్యాశాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బో ర్డు పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. పరీక్షలపై ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేసేత క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షలపై సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబరు 90599 87730ను సంప్రదించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, విద్యాశాఖ అధికారులు ఎం.పరమేశ్వర్, పద్మ, లింబాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment