ఏరియాస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందం
భైంసాటౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని కాయకల్ప బృందం బుధవారం సందర్శించింది. బృందం సభ్యుడు డాక్టర్ శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో రోగులకు అందుతున్న సేవలు, పారిశుధ్య నిర్వహణ, క్లినికల్ వేస్టేజ్, గడువు ముగిసిన మందుల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, నర్సింగ్ ఉద్యోగులతో సమావేశమై మాట్లాడారు. రోగులకు మెరుగైన సేవలందించడంలో పోటీ పడేందుకు కాయకల్ప ర్యాంక్‌లు ఇ స్తుందని పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి నివేదిక పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాయకల్ప బృందం సభ్యులు హెడ్‌నర్స్ సుజాత, ఫార్మసిస్ట్ శ్రీలత, మాణిక్యం, ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్లు చంద్ర సుజాత, రేఖ, హెడ్‌నర్స్ విజయశ్రీ, స్టాఫ్ నర్స్ మంజూష తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment