నిధులు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● మున్సిపల్ అధికారులతో సమీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులు సమర్ధవంతంగా వినియోగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ అధికా రులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ల వారీగా కేటాయించిన నిధులు, చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులు, అందుబాటులో ఉన్న నిధులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలు పార్కులకు వచ్చేలా చూడాలని తెలిపారు. గేట్లు, గోడలకు రంగులు వేసి, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పట్టణ వాసులను భాగస్వాములను చేస్తూ పార్కులకు అసోసియేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ శాఖకు సంబంధించి వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, జాదవ్‌కృష్ణ, రాజేశ్‌కుమార్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment