
నిర్మల్
రంజాన్ వేళలు
7
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
క్షయ రహిత జిల్లాకు కృషి
● డీఎంహెచ్‌వో రాజేందర్
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్‌ను క్షయ రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలనీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రపంచ క్షయ దినోత్సవం సోమవారం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చాలన్నారు. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న ప్రజలను గుర్తించి వారందరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్ల న్నే కేసులో గుర్తింపు సులభతరం అవుతుందన్నారు. సమావేశంలో కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ నైనారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఖాళీగా ఇథనాల్ స్థలం
● జిల్లాలో పరిశ్రమలకు గ్రహణం ● ఇథనాల్.. క్యాన్సిల్!?
● ఆయిల్‌పామ్ అనుమానమే.. ● అడ్రస్‌లేని ఇండస్ట్రీయల్ కారిడార్..
● అభ్యంతరాలు తెలుసుకోకుండా పనులు ● ఆదిలోనే తప్పని అడ్డంకులు
ఇథనాల్ కథేంటి..!?
జిల్లాలో తొలి ప్రధాన పరిశ్రమగా వచ్చిన ఇథనాల్‌కు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. తీవ్ర ప్రజావ్యతిరేకతతో ఆగమ్యగోచరంగా మారింది. దిలావర్‌పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య పీఎంకే సంస్థ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టింది. ఈ ఫ్యాక్టరీ వల్ల భవిష్యత్తులో తమపై కాలుష్య ప్రభావం ఉంటుందంటూ స్థానిక గ్రామాలు అడ్డుచెప్పాయి. పరిశ్రమ ఏర్పాటు కోసం నిర్వాహకులు, అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో గత నవంబర్‌లో ఒక్కసారి ఆ గ్రామాల ఆందోళన భగ్గుమంది. ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చి రోజులపాటు రహదారులు దిగ్బంధం చేశాయి. రాష్ట్రప్రభుత్వం సైతం ప్రజాందోళనకే మద్దతు తెలుపుతూ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తామని ప్రకటించింది. దీంతో ఇథనాల్ పరిశ్రమ కథ అక్కడితో ఆగిపోయింది.
ఆయిల్‌పామ్.. ఏమవుతుందో..!
జిల్లాలో ఇథనాల్ తర్వాత వచ్చిన మరో పరిశ్రమ ఆయిల్‌పామ్. సోన్ మండలం పాక్‌పట్ల(పాత పోచంపాడ్) సమీపంలో ఎస్పారెస్పీ ప్రాజెక్టు దిగువన ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం కేటాయించారు. ప్రియూనిక్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయాల్సిన ఈ పరిశ్రమకు 2023 అక్టోబర్ 4న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఎస్సారెస్పీ దిగువన బఫర్‌జోన్‌లో ఉన్న ఈ పరిశ్రమ స్థలంపై అభ్యంతరాలు ఉన్నాయి. పలు శాఖల నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో ముందుకు సాగడం లేదు. ఇటీవల ఈ పరిశ్రమ వ్యవహారం రాజకీయరంగు పులు ముకుంది. ఆయిల్‌పామ్ ఆగిపోవడానికి మీరంటే మీరే కారకులు అంటూ కాంగ్రెస్–బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు.
పంటలను సెట్ చేయాలి..
ఏ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా కేవలం పరిశ్రమలు ఉంటేనే సరిపోదు. వాటికి అనుగుణంగా ఎప్పటికీ సరిపడా ముడిపదార్థాలు కావాలి. ఫ్యాక్టరీ పెట్టేముందు దానికి సంబంధించి ఈ ప్రాంతంలో పంటల సాగు సరళి, అలాగే స్థానిక రైతాంగం అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలన్న విషయమూ చర్చకు వచ్చింది. పరిశ్రమలను పెట్టాలన్న ఆలోచన చేసే ముందే స్థానికంగా పంటసాగు సరళిని సెట్ చేయాల్సిన అవసరం ఉంది.
ప్రతిపాదనల్లోనే కారిడార్
సహర్
ఇఫ్తార్
న్యూస్‌రీల్
ముందుచూపు ఉండాలి..
జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పరిశ్రమతోనే చేదు అనుభవం ఎదురైంది. ఇథనాల్ ఫ్యాక్టరీ తమకు వద్దంటూ ఊళ్లు ఎదురుతిరిగాయి. సర్కారు సైతం ఆ గ్రామాలకే వత్తాసు పలికింది. ఇలాంటి సందర్భంలో.. మరి జిల్లాకు ఏం కావాలి..!? ఎలాంటి పరిశ్రలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది..!? అసలు పరిశ్రమలను ఏర్పాటు చేసేముందు జిల్లాలో ఉన్న వనరులు, పంటల సరళిపై పరిశోధనలు చేస్తున్నారా..!? అన్న ప్రశ్నలకు ఎలాంటి జవాబులు లేవు. ఆయిల్‌పామ్‌కు స్థలమే అడ్డంకిగా మారుతోంది. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పారిశ్రామికాభివృద్ధిపై యోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పరీక్షల వేళ ఆరోగ్యాన్ని
అశ్రద్ధ చేయొద్దు
లక్ష్మణచాంద: పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దని ఎంజేపీ గురుకులాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్‌సీవో గోపీచంద్ పేర్కొన్నారు. మండలంలోని రాచాపూర్ ఎంజేపీ గురుకుల పాఠశాలను సోమవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇది వరకే పూర్తయిన పరీక్షలు ఎలా రాశారో అడిగి తెలుసుకున్నారు. రానున్న గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు చాలా కీలకమన్నారు. సంబంధిత సబ్జెక్టు టీచర్స్ స్టడీ అవర్స్‌లో సబ్జెక్టులపై, మోడల్ క్వశ్చన్ పేపర్‌పై, పార్ట్ బి పేపర్‌పై అవగాహన కల్పిస్తూ పిల్లలు శ్రద్ధగా చదివేలా చూడాలని సూచించారు. విద్యార్థులకు సాయంత్రం, నైట్ స్టడీ అవర్స్‌లో టీ, స్నాక్స్ అందించాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి ఫలితం వస్తుందని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు అశోక్, నాగరాజు, వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి బాటలు పడలేదు. మంజూరైన పరిశ్రమలకు పట్టిన గ్రహణం వీడటం లేదు. పాలకుల లోపమా, అధికారుల పనితనమా, ప్రశ్నించలేని ప్రజల అమాయకత్వమా.. అర్థం కావడం లేదు. విషయం ఏదైనా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా జిల్లాలో ఏర్పాటు ప్రారంభం కాలేదు. ఇథనాల్ పరిశ్రమ ఆదిలోనే ఆగిపోయింది. ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయి. ఇక ఏళ్లుగా ఊరిస్తున్న 44వ జాతీయ రహదారి వెంట ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదన అడుగు కూడా ముందుకు పడలేదు. బాసరలో ఏర్పాటు చేస్తామన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లూ జాడలేవు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే జిల్లాకు పరిశ్రమలు వస్తాయన్న ఆశ ఏ కోశానా లేదు. – నిర్మల్
హైదరాబాద్–నాగ్‌పూర్ హైవే
ఆయిల్‌పామ్
శిలాఫలకం
రైతుల ప్రయోజనాలే ముఖ్యం..
పరిశ్రమల ఏర్పాటు అవసరమా.. అన్న ప్రశ్న ముందుగా రావాలి. అవసరం అనుకుంటే స్థానిక వనరులను, పంటల సరళిని ముందుగా అంచనా వేయాలి. స్థానిక రైతులు సదరు పరిశ్రమకే బానిసలుగా మారేలా ఉండకూడదు. రైతుల చేతుల్లోనే ఆ పరిశ్రమల జుట్టు ఉండాలి. జీరో పొల్యూషన్ పరిశ్రమలైతేనే ప్రస్తుతం మనుగడ సాగించే అవకాశాలు ఉన్నాయి. – ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి,
పబ్లిక్ పాలసీ ఎక్స్‌పర్ట్
హైదరాబాద్–నాగ్‌పూర్ 44 జాతీయ రహదారి వెంట ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ అలాంటి ప్రతిపాదనకు అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రతీసారి బడ్జెట్‌లో పారిశ్రామిక ప్రగతిలో భాగంగా ఈ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామంటూ చెప్పడమే మినహా ఎలాంటి ప్రయోజనం లేదు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు వరకే ఎన్‌హెచ్.44 వెంట పరిశ్రమల ఏర్పాటు ఆగిపోయింది. గతంలో బాసరలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేస్తామన్న ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలూ బుట్టదాఖలయ్యాయి.

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్