నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా పెంబి మండలం జీడిమాల్య, రాగిదుబ్బ గిరిజన గేడేలకు, తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదివాసీలు కలెక్టర్‌ను కోరారు. కరెంటు లేక చీకట్లో ఉంటున్నామని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చి అభిలాష అభినవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. పాలకులు మారినా తమ బతుకులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో తమ గూడేలు, వ్యవసాయ భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గం నాయకుడు బన్సీలాల్ రాథోడ్, ఆరే రాయుడు, తండా నాయక్ గుగ్లావత్ గణేశ్, రాజేందర్, రమేశ్, జల్పత్, చంపత్, ధన్సింగ్, మాలావత్ రమేశ్, ముకుంద్‌రావు, పర్సురామ్, బాబూలాల్ పాల్గొన్నారు.