
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు
● పలువురు అభ్యర్థులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ మెడికల్ కళాశాల గత సంవత్సరం నవంబర్ 4న విడుదల చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించి ఉద్యోగాల భర్తీ అనుభవం ప్రామాణికంగా కాకుండా డబ్బే ప్రామాణికంగా చేశారని పలువురు అభ్యర్థులు కలెక్టరేట్ ఏవోకు శనివారం వినతిపత్రం అందించారు. గతంలో తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధీనంలో ఉన్న నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహించిన వారికి ఈ నియామకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఇన్‌చార్జి మంత్రి సీతక్క, కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారన్నారు. శుక్రవారం విడుదల చేసిన 52 మంది జాబి తాలో ఒక్కరు కూడా అనుభవం ఉన్నవారు లేరని తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులు డబ్బుల కోసం అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టారని ఆరోపించారు. ఫలితంగా కొన్నేల్లుగా జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 18 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అధికారులు విచారణ జరిపి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అప్పటివరకు నియామక ప్రక్రియ నిలిపివేయాలన్నారు. నిరసనలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నరహరి, రవి, సుమ, మమత, రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.